కలలో డబ్బు కనిపించడం శుభమా లేక అశుభమా..? స్వప్నశాస్త్రం ఏం చెబుతోందంటే..

Updated on: Aug 21, 2025 | 1:37 PM

కొన్ని కొన్ని సార్లు మనం కలలలో చాలా సంపదను చూస్తాము. మనం నోట్లను లెక్కపెడుతున్నట్లు చూస్తాము, దాని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. ఈ సందర్భంగా కలలో మీరు డబ్బును చూస్తే ఏం జరుగుతుంది.? మీరు త్వరగా కోటీశ్వరులవుతారా.. మీ దశ ఒక్కసారిగా మారిపోతుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5
స్వప్నశాస్త్రం ప్రకారం, కలలకు రాహువు కీలకం. మీ జాతకంలో రాహువు స్థానం బాగుంటే మీకు అద్భుతమైన కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కలలు మన భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు సహాయపడతాయి. డబ్బును దొంగిలించాలని కలలు కనడం అపరాధం, అభద్రతను సూచిస్తుంది.

2 / 5
అయితే, మీరు కలలో డబ్బును చూసినట్లయితే లేదా ఎవరైనా మీకు డబ్బు ఇస్తే, ఇది శుభ సంకేతం. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఎవరైనా కలలో నాణేలను చూసినట్లయితే, అది శుభసూచకం కాదని అంటున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు సంతకేతంగా నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కలలో మీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నట్లు అనిపిస్తే, మీరు ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలని నిపుణులు చెబుతున్నారు. కలలో డబ్బు మాయమవడం లేదా చిరిగిన నోట్లు కనిపించడం అశుభంగా భావిస్తారు. ఇది సంపద నష్టానికి దారితీస్తుంది.

4 / 5
మీరు కలలో పాతిపెట్టిన డబ్బును చూసినట్లయితే, అకస్మాత్తుగా సంపద లేదా గౌరవం లభించే అవకాశం ఉంది. ఎవరైనా కలలో మీ డబ్బును దొంగిలిస్తే, అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. అంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం.

5 / 5
కలలో డబ్బు కనిపించడం అంటే కొత్త అవకాశాలు, ఇది ఊహించని లాభాలను సూచిస్తుంది. అది ఆర్థిక, వ్యక్తిగత వృద్ధిని సూచిస్తుంది. డబ్బును కోల్పోయే కలలు ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత నష్టాల భయాన్ని సూచిస్తాయి. కలలో లాటరీని గెలవడం అనేది పరిస్థితులలో తీవ్రమైన మార్పు కోసం కోరిక, అభివ్యక్తి కావచ్చు. అధిక సంపద, ఐశ్వర్యం కలలు మరింత సౌకర్యవంతమైన జీవితం కోసం ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలను బహిర్గతం చేస్తాయి.