రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే కలిగే ప్రయోజనాలివే..

|

Jul 28, 2024 | 6:26 AM

అల్లం టీ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి, రోజూ రెండు కప్పుల అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రిలాక్స్ తోపాటు.. మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1 / 6
అల్లం టీ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి, రోజూ రెండు కప్పుల అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రిలాక్స్ తోపాటు.. మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామంది ప్రత్యేకమైన సువాసన టీపొడి, అల్లంతో టీని తయారు చేసుకోని ఆస్వాదిస్తూ తాగుతుంటారు. ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల కొన్ని సమస్యలు దూరమవుతాయి.. అవేంటో తెలుసుకోండి..

2 / 6
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  అల్లంలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుంది. దీంతో సీజనల్‌ అనారోగ్య సమస్యలు దరిచేరవు..

3 / 6
వికారం - వాంతుల నివారణ:  సాధారణ వికారం లేదా వాంతులు సమస్యకు అల్లం టీ ఉత్తమ నివారణగా చెప్పవచ్చు. అల్లం దుంపలో ఉండే అస్థిర నూనెలు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి క్రియాశీల భాగాలు నాడీ వ్యవస్థ, కడుపు, ప్రేగుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

4 / 6
రక్త ప్రసరణ:  ఆరోగ్యానికి అల్లం టీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని జింజెరోల్, జింజెరోన్ వంటి సమ్మేళనాలు శరీరాన్ని వేడి చేయడం ద్వారా మంచి ప్రసరణను ప్రేరేపిస్తాయి.

5 / 6
పెయిన్ రిలీవర్: అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కండరాలు, కీళ్ల నొప్పులకు చికిత్స చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

6 / 6
బహిష్టు సమస్య:  ఆడపిల్లల్లో నెలసరి సమయంలో అల్లం టీ తాగడం వల్ల రుతుక్రమంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అంతే కాదు, ఇది ఇతర రుతుక్రమ సంబంధిత రుగ్మతలను దూరం చేయడంతోపాటు వాటినుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.