
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడం (Cooling the body) ఎంతో ముఖ్యం. దీనికోసం ఒక అద్భుతమైన చిట్కాను తెలుసుకోండి. సమ్మర్‌లో కీరా దోసకాయ (Cucumber) జ్యూస్ లేదా సలాడ్ తీసుకోవడం అత్యుత్తమ మార్గం. కీరాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

కీరా రసంలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని, అందులో ఒక తమలపాకును (Betel Leaf) వేసి తీసుకుంటే అది శరీరానికి అమితమైన చలవను ఇస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తూనే సహజసిద్ధమైన వెయిట్ లాస్ డ్రింక్‌లా పనిచేస్తుంది.

ప్రస్తుత మార్కెట్లో దొరికే పండ్లు, కొబ్బరి నీళ్లలో జరుగుతున్న కల్తీల సంగతి తెలిసిందే. బొండాలలో స్వీట్నెస్ పెంచడానికి సిరంజిల ద్వారా ఇంజెక్షన్లు ఇస్తున్నారని, అలాగే వాటర్ మెలన్ (పుచ్చకాయ) లో కూడా ఎరుపు రంగు, తీపి కోసం కెమికల్స్ వాడుతున్నారు. కల్తీ లేని అసలైన పుచ్చకాయను గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది.

పుచ్చకాయను కట్ చేసినప్పుడు లోపల అంతా ఒకే రకమైన ఏకరీతి ఎరుపు రంగులో ఉంటే అది 100 శాతం రంగులు దట్టించిన కల్తీ పండు అని అర్థం. సహజమైన పుచ్చకాయ ఎప్పుడూ మధ్య భాగంలో ముదురు రంగులో ఉండి, చుట్టూ పైతొక్క వైపు వెళ్లేకొద్దీ లేత గులాబీ రంగులోకి మారుతుంది. కొబ్బరి నీళ్లలో కూడా కేవలం తీపి మాత్రమే కాకుండా కొద్దిగా పులుపు, ఉప్పు రుచులు కూడా కలిసి ఉంటేనే అది అసలైన సహజ నీరు.

వేసవి లో కూడా చర్మం మెరిసేలా ఉండటానికి ఒక రహస్యం ఉంది. అది ఏదోకాదు హైడ్రేషన్. వేసవిలో శరీరానికి నిరంతరం నీటి శాతాన్ని అందించడమే చర్మ సౌందర్యానికి అసలైన గీటురాయి. దీనితో పాటు ప్రతి భోజన ప్లేట్‌లోనూ ఒక అర నిమ్మకాయను (Vitamin C) తప్పనిసరిగా ఉంచుకోవాలి. పప్పు అయినా, ఫిష్ అయినా దేనిపైనైనా సరే నిమ్మరసం పిండుకుని తినడం చాలా మంచింది. అప్పటికప్పుడు శరీరానికి అందే ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మంపై ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.