
లెమన్ రైస్.. చాలా మంది పిల్లలు ఇష్టంగా తినే దానిలో లెమన్ రైస్ ముందుంటుంది. అయితే దీనిని ఎలా చేయాలి అంటే? ఉడికిన అన్నం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలోనే స్టవ్ ఆన్ చేసి పాన్, నూనె పోసి, అందులో ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చి మిర్చీ, కరివేపాకు వేసి, చివరిలో నిమ్మరసం, పసుపు వేయాలి. తర్వాత అందులో మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే టస్టీ టేస్టీ లెమన్ రైస్ రెడీ. ఇది వారంలో ఎప్పుడైనా పెట్టొచ్చు. మీ పిల్లలు ఇష్టంగా తింటారు.

పిల్లలు ఇష్టపడే లంచ్ రిసిపీల్లో టమాటా రైస్ కూడా ఒకటి. దీనిని ఏదైనా చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. దీని కోసం టమాటా గుజ్జు తీసుకొని, ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి ఫ్రై చేసి, అందులో అన్నం కలపాలి. అంతే రుచికరమైన టమాటా రైస్ రెడి. పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారు.

పుదీనా రైస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే తప్పకుండా సోమ వారం నుంచి శని వారంలో ఒక్కరోజు అయినా సరే లంచ్ బాక్స్‌లో ఈ రిసిపీ పెట్టడం చాలా మంచిది. పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు. దీని కోసం, పూదీనా, కొత్తిమీర, అల్లం పచ్చి మిర్చీ అన్నీ నూనెలో వేయించి, అందులో అన్నం కలపాలి. అంతే టేస్టీ టేస్టీ పూదీనా రైస్ రెడీ.

కర్డ్ రైస కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గడ్డ పెరుగులో అన్నం వేసి కలిపి, ఎండు మిర్చితో తాలిపు వేసి, పైన దానిమ్మ గింజలు వేసి ఇస్తే పిల్లలు చాలా కొత్తగా ఉందని, ఇష్టంగా కూడా తింటారు. అంతే కాకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా మీరు ఈ మెనూలో యాడ్ చేయవచ్చును. క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ, సోయా సాస్ వంటి వాటితో నిమిషాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయోచ్చు.

ఇవే కాకుండా ఆల్ మిక్సిడ్ వెజ్ ఫ్రై రైస్, కొన్ని సార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్, పన్నీ ర్ ఫ్రైడ్ రైస్.. ఇలా రక రకాల వంటకాలు చేసి మీ పిల్లలకు లంచ్ బాక్స్‌ల్లో పెట్టాలి. ప్రతి రోజూ ఒకటే కాకుండా, రోజుకు ఒక వెరైటీ పెట్టడం వలన వారు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు.