పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..? తినేముందు తెలుసుకోండి..

Updated on: Mar 27, 2026 | 5:39 PM

Watermelon vs Cucumber: ఎండలు మండిపోతున్నాయి. బానుడి భగభగలకు శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతోంది. ఈ సమయంలో మనకు తక్షణమే గుర్తొచ్చేవి పుచ్చకాయ, కీర దోసకాయ. ఈ రెండింటిలోనూ నీటి శాతం ఎక్కువే, పోషకాలూ ఎక్కువే. అయితే ఈ రెండింటిలో ఏది మీ శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది..? అసలు ఎవరెవరు వీటిని తినకూడదు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పోషకాల పోరాటం: పుచ్చకాయ, దోసకాయ రెండూ శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో దిట్ట. కానీ వాటిలోని పోషక విలువలు వేరుగా ఉంటాయి. దోసకాయలో విటమిన్ కె, సి తో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, మలబద్ధకం తగ్గించడానికి ఎంతగానో తోడ్పడతాయి. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ఒక వరం.

2 / 5
నీటి శాతం: హైడ్రేషన్ విషయానికి వస్తే రెండూ అద్భుతమే. అయితే సాంకేతికంగా చూస్తే పుచ్చకాయ కంటే దోసకాయలో నీటి శాతం ఎక్కువ. దోసకాయలో సుమారు 95శాతం నుంచి 96శాతం వరకు నీరు ఉంటే పుచ్చకాయలో 92శాతం ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి రెండూ మంచి ఆప్షన్లే.

3 / 5
వీరు జాగ్రత్తగా ఉండాలి: అమృతం లాంటి పండ్లే అయినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినే ముందు ఆలోచించాలి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు, కిడ్నీ, తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయకు దూరంగా ఉండటం మంచిది. రాత్రిపూట నిద్ర పట్టని వారు దోసకాయ తినకపోవడమే ఉత్తమం. ఆస్తమా, సైనస్, తరచుగా జలుబు చేసే వారు ఈ రెండింటిని పరిమితంగా తీసుకోవాలి లేదా మానుకోవాలి.

4 / 5
బడ్జెట్ ఫ్రెండ్లీ ఏది?: ఆర్థికంగా చూస్తే పుచ్చకాయ కంటే దోసకాయ కొనడం, నిల్వ చేయడం సులభం. దోసకాయలో వ్యర్థ భాగం తక్కువగా ఉంటుంది. దీనిని ఫ్రిజ్ లేకుండా కూడా కొంతకాలం నిల్వ చేయవచ్చు. అదే పుచ్చకాయ అయితే పరిమాణం పెద్దదిగా ఉండటం వల్ల ఖర్చు కూడా ఎక్కువే.

5 / 5
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు ఈ వేసవిలో ఒక రోజు పుచ్చకాయ, ఒక రోజు దోసకాయ మార్చి మార్చి తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పండ్లను రసంగా తాగడం కంటే ముక్కలుగా కోసుకుని తినడమే ఆరోగ్యానికి అత్యుత్తమం.

Follow Us