
సమానమైన ముక్కల కోత: మాంసం కోసేటప్పుడు ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా కట్ చేయాలి.

నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: మాంసాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ పట్టించి పక్కన పెట్టాలి. దీనివల్ల రక్తపు వాసన పోవడమే కాకుండా మాంసంలోని పీచులు మెత్తబడి త్వరగా ఉడుకుతుంది.

పెరుగుతో మారినేషన్: మటన్ వండటానికి కనీసం 30 నిమిషాల ముందు పెరుగు, ఉప్పు, కారం, మసాలాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి నానబెట్టాలి. పెరుగులోని సహజ ఆమ్లాలు మటన్‌ను సాఫ్ట్‌గా మారుస్తాయి.

పచ్చి బొప్పాయి పేస్ట్ : మటన్‌ను వేగంగా ఉడికించడంలో పచ్చి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా పచ్చి బొప్పాయి పేస్ట్ మటన్‌కు పట్టించి నానబెడితే, ఎంత గట్టి మటన్ అయినా క్షణాల్లో దూదిలా మెత్తగా ఉడికిపోతుంది.

ప్రెజర్ కుకర్, ఉప్పు వేసే సమయం: ఓపెన్ పాత్రల కంటే ప్రెజర్ కుకర్‌లో మటన్ వండితే త్వరగా ఉడుకుతుంది. మొదట మితమైన మంటపై మాంసాన్ని బాగా వేయించి, ఆ తర్వాత కుకింగ్ చేయాలి. ముఖ్యంగా ఉప్పును వంట ప్రారంభంలో కాకుండా చివర్లో వేయాలి. మొదటే ఉప్పు వేస్తే మాంసం గట్టిపడే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే సమయం ఆదా అవ్వడమే కాక, మటన్ కర్రీ రుచి కూడా అమోఘంగా ఉంటుంది!