రోజూ ఓ గుప్పెడు నల్ల నువ్వులు చాలు.. ఆ సమస్యలన్నీ పరార్‌..! నెల రోజుల్లో రిజల్ట్ చూసి షాక్ అవుతారు..

Updated on: Sep 11, 2026 | 3:57 PM

నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. నిండా ముప్పై ఏళ్లు నిండకుండానే జుట్టు విపరీతంగా రాలిపోవడం, బట్టతల రావడం, తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి కోసం బ్యూటీ సెలూన్లు, కెమికల్ ఉత్పత్తులపై భారీగా ఖర్చు చేసినా అనుకున్న ఫలితం ఉండదు. అయితే మన వంటింట్లోనే దొరికే నల్ల నువ్వుల తో ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం ముఖ్యమైనవి. తప్పుడు జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. వీటికి చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గం నల్ల నువ్వులు. వీటిల్లో జింక్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఉండే కాపర్ కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు సహజ రంగును కాపాడుతుంది.

2 / 5
నల్ల నువ్వుల్లోని విశేష పోషకాలు: నల్ల నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్ E వంటి ఎన్నో అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లకు లోతైన పోషణను అందించి, జుట్టు వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

3 / 5
జుట్టు రాలడం నిరోధిస్తుంది: నువ్వులలో ఉండే జింక్, మెగ్నీషియం తలలో రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేసి, కుదుళ్లు ఊడిపోకుండా అడ్డుకుంటాయి. విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు తల ఉపరితలాన్ని ఆరోగ్యంగా ఉంచి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి.

4 / 5
తెల్ల జుట్టుకు చెక్: నల్ల నువ్వుల్లో కాపర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టులో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తిని పెంచుతుంది. రోజువారీ ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల జుట్టు తెల్లబడటం మందగించి సహజ నలుపు రంగు కాపాడబడుతుంది.

5 / 5
ఎలా ఉపయోగించాలి?: నల్ల నువ్వుల నూనెను స్వల్పంగా వేడి చేసి వారానికి రెండు సార్లు తలకు మసాజ్ చేస్తే జుట్టు బలంగా మారుతుంది. రోజువారీగా 1 నుంచి 2 టీస్పూన్ల నల్ల నువ్వులను నేరుగా లేదా సలాడ్లు, కూరగాయలలో కలిపి తీసుకోవచ్చు. పిత్త దోషం ఉన్నవారు నువ్వుల వేడిని తగ్గించడానికి వాటిని పచ్చి కొబ్బరి లేదా సోంపుతో కలిపి తీసుకోవడం శ్రేయస్కరం.

Loading...
Unable to load recommendations.
Follow Us