Vitamin Deficiency: ఒంట్లో ఈ విటమిన్లు లోపించినా క్యాన్సర్ వస్తుందట! ఏయే విటమిన్లో తెలుసా..

|

Aug 09, 2024 | 1:21 PM

శరీరంలో క్యాన్సర్ వేళ్ళూనుకోవడానికి కారణాలేమిటో ఇప్పటికీ పరిశోధకులు గుర్తించలేకపోతున్నారు. అయితే జన్యుపరమైన, జీవనశైలి కారకాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని, అలాగే కొన్నిసార్లు విటమిన్లు, మినర్స్‌ లోపం వల్ల కూడా క్యాన్సర్కు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ నివారణలో పోషకాహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కొన్ని విటమిన్ లోపాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి..

1 / 5
శరీరంలో క్యాన్సర్ వేళ్ళూనుకోవడానికి కారణాలేమిటో ఇప్పటికీ పరిశోధకులు గుర్తించలేకపోతున్నారు. అయితే జన్యుపరమైన, జీవనశైలి కారకాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని, అలాగే కొన్నిసార్లు విటమిన్లు, మినర్స్‌ లోపం వల్ల కూడా క్యాన్సర్కు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ నివారణలో పోషకాహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కొన్ని విటమిన్ లోపాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ విటమిన్లో, ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
విటమిన్ సి.. అనేది ఒక రకమైన నీటిలో కరిగే విటమిన్. ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం నయం, రోగనిరోధక పనితీరులో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకం లేకపోవడం వల్ల కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాల బారీన పడే ఛాన్స్‌ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కార్సినోజెనిసిస్‌ను నివారించే శక్తి విటమిన్ ఇ కి ఉంటుంది. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. విటమిన్ ఇ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

4 / 5
కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తిలో విటమిన్ ఎ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ శరీరంలో విటమిన్ ఎ లోపం తెలెత్తితే ఊపిరితిత్తులు, అన్నవాహిక, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పోషకం లోపం శరీరంలో ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో తగినంత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గుతుంది.

5 / 5
క్యాన్సర్ ముప్పు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ సక్రమంగా చూసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే అన్ని పోషకాలు శరీరంలో పుష్కలంగా ఉండేలా చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.