1 / 5
Viral Photos: మన బండ్లను పార్కింగ్ చేయడానికే స్థలం లేదురా బాబూ అంటే.. వేరెవరో వచ్చి కొద్దిసేపు, ఒక్క 5 నిమిషాలు, వెంటనే వెళ్లిపోతాం అంటూ రీజన్స్ చెబుతూ కార్లు, బైక్స్ పార్కింగ్ చేస్తుంటారు పలువురు. అలాంటి వారి కోసమే చాలా మంది తమ తమ స్థలాల్లో నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేస్తుంటారు. వాహనాల పార్కింగ్ విషయంలో గొడవలు కూడా అవుతుంటాయి. పార్కింగ్ విషయంలో అవస్థలు పడకుండా ఉండేందుకు.. చాలా మంది నో పార్కింగ్ పేరుతో రకరకాల సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. చాలావరకు ‘NO PARKING’ అని బోర్డు పెడతారు. కానీ, కొందరైతే.. కాస్త వినూత్నను జోడించి ఆ బోర్డును ఏర్పాటు చేస్తారు. అలాంటి ఫన్నీ బోర్డులను ఇప్పుడు మీకోసం ఇక్కడ చూపుతున్నాం.