ఆ దేశంలో సమోసా తింటే శిక్ష పడుతుందా? బ్యాన్ వెనుక అసలు కారణం ఇదే!

Updated on: Oct 19, 2026 | 6:38 PM

Samosa Ban: సమోసా అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. సాయంత్రం వేళ వేడివేడి సమోసా తింటూ టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే, ఒక దేశంలో సమోసాలపై నిషేధం విధించారనే వార్తలు ఎప్పుడైనా విన్నారా? అసలు ఆ దేశం ఏది? సమోసాపై నిషేధం విధించడానికి చెప్పిన కారణం ఏమిటి? ఈ ఆసక్తికరమైన విషయం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

1 / 5
సమోసా.. భారతీయులకు ఎంతో ఇష్టమైన చిరుతిండి. సాయంత్రం వేళ వేడివేడి సమోసాతో టీ తాగడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ స్నాక్‌కు భారత్‌లోనే కాదు, అనేక దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే, ప్రపంచంలో ఒక దేశంలో సమోసాపై నిషేధం విధించారనే విషయం మీకు తెలుసా? ఆ దేశం పేరు సోమాలియా. ఈ నిషేధం వెనుక చెప్పుకునే కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

2 / 5
మీడియా కథనాల ప్రకారం, సోమాలియాలోని అల్‌-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ సమోసా ఆకారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. త్రిభుజ ఆకారంలోని సమోసా క్రైస్తవ మత చిహ్నమైన హోలీ ట్రినిటీ చిహ్నాన్ని పోలి ఉందని ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ కారణంతో సమోసాల తయారీ, విక్రయం, వినియోగంపై 2011లో అల్-షబాబ్ ఆధీనంలోని సోమాలియాలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

3 / 5
అయితే, ఈ నిషేధానికి సంబంధించి ప్రచారంలో ఉన్న భిన్న వాదనలు కూడా ఉన్నాయి. దీన్ని బ్యాన్ చేయడానికి సమోసా ఆకారమే ఏకైక కారణమని నిర్ధారించే ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. సమోసాల్లో పాడైపోయిన మాంసాన్ని ఉపయోగిస్తున్నారనే ఆరోపణల వల్ల కూడా నిషేధం విధించారనే వాదన కూడా ఉంది.

4 / 5

సమోసా భారతదేశంలో ప్రసిద్ధి చెందినప్పటికీ, దాని చరిత్ర మధ్య ఆసియా, పర్షియా ప్రాంతాలతో ముడిపడి ఉంది. వ్యాపారులు, ప్రయాణికుల ద్వారా ఈ స్నాక్ భారత ఉపఖండానికి చేరినట్లు చరిత్రకారులు వివరిస్తారు. కాలక్రమేణా స్థానిక రుచులకు అనుగుణంగా మార్పులు చెంది, బంగాళాదుంపలు, బఠానీలు, మసాలాలతో తయారు చేసే సమోసా భారతీయ చిరుతిండిలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

5 / 5
పాఠకుల ఆసక్తి మేరకు ఈ కథనాన్ని ఇవ్వడం జరిగింది. సోమాలియా దేశమంతటా ప్రస్తుతం సమోసాపై బ్యాన్ కొనసాగుతోందా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. సమోసాపై విధించిన ఈ నిషేధం ఇప్పటికీ అక్కడ అమలులో ఉందని టీవీ9 ధృవీకరించడం లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us