నెల క్రితం KG రూ.100 ఇప్పుడేమో రూ.10 కంటే తక్కువే.. లబోదిబో అంటున్న టమోటా రైతులు

| Edited By: Ram Naramaneni

Feb 18, 2022 | 8:46 PM

మొన్నటి వరకు ఆకాశాన్ని ఆంటీన టమోటా ధర.... ఒక్కసారిగా కుప్పకూలింది,కిలో టమోటా 10 రూపాయలకు ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

1 / 13
మొన్నటి వరకు ఆకాశాన్ని ఆంటీన టమోటా ధర.... ఒక్కసారిగా కుప్పకూలింది,కిలో టమోటా 10 రూపాయలకు ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పూర్తి గా టమోటా ధర పడిపోవడంతో పత్తికొండ టమోటా మార్కెట్ ను బంద్ చేశారు అధికారులు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మిరే చూడండి.

2 / 13
ఓ రైతుకు 4 ఏకారాల పొలం ఉంటే అందులో 3 ఎకరాల విస్తీర్ణంలో టమోటా పంటనే సాగు చేస్తారు రైతులు.అంటే టమోటా పంటపై రైతులకు ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

3 / 13
అయితే దేశ వ్యాప్తంగా తుపాను లు రావటం తో అక్కడ ఉన్న టమోటా పంటలు పూర్తి గా దెబ్బతినడం తో తెలుగు రాష్ట్రాల లో ఎప్పుడు లేని విధంగా ఒక్కేసారి కిలో టమోటా 100 రూపాయల నుండి 120 రూపాయల వరకు ధర  పెరగడంతో వినియోగదారుల ఆందోళన చెందారు.

4 / 13
అయితే రైతులు మాత్రం ఎప్పుడు లేని ధర ఒక్కేసారి పెరగడం తో ఆనందం వ్యక్తం చేశారు. ఇంతలోనే వారి ఆశలు అడియాశలు అయ్యాయి

5 / 13
ప్యాపిలి టమోటా మార్కెట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత నెలరోజుల తో పోలిస్తే టమోటా రైతు కుప్పకూలిపోయిన పరిస్థితి నెలకొంది. 2 నెలల క్రితం దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ధర అధికంగా ఉండటంతో రైతు సంతృప్తి చెందేవారు.

6 / 13
ఇప్పుడు దిగుబడి అదే స్థాయిలో ఉండగా ధరలు మాత్రం పాతాళానికి పడిపోయాయి. టమోటా నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం లేదు ఏరోజు పంట ఆరోజు అమ్ముకోవాల్సిందే దీనిని దృష్టిలో పెట్టుకుని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మెట్టు పల్లి గ్రామంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

7 / 13
స్థల సేకరణ కూడా పూర్తయింది అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టారు. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది కర్నూలు జిల్లాకు ఐదు దశాబ్దాల కల. ఇదే కనుక పూర్తయితే టమోటా రైతులకు కొంత మేర కష్టాలు తీరినట్లే అవుతుంది

8 / 13
ఈ సంవత్సరం లో ఖరీఫ్,రబీ  సీజన్లలో  టమోటా ధర కిలో 50 రూపాయల నుండి మొదలై 120 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల లో ఎప్పుడు లేని విధంగా టమోటా కు భారీ రేట్లు రావడం ఇదే మొదటిసారి.ఆరు నెలల పాటు మంచి రేట్లు ఉన్న టమోటా ప్రస్తుతం పూర్తి గా ధర లు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

9 / 13
 ప్రస్తుతం రైతులు పొలం ఉన్న టమోటా లు మార్కెట్ కు తరలించిన రవాణా చార్జీలు రాకపోవడంతో టమోటా పంట ను పొలంలో నే వదిలి వేస్తున్నారు.రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో  పత్తికొండ వ్యవసాయ మార్కెట్ అధికారులు బంద్ చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10 / 13
 ప్రభుత్వం తో మాట్లాడి రైతులకు న్యాయం చేయవలిసిన అధికారులు ఒక్కేసారి టమోటా మార్కెట్ ను బంద్ చేయడం దారుణం అంటున్నారు రైతులు. అయితే పత్తికొండ రైతుల కల టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే కనీసం టమోటా పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని, పత్తికొండ లో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులు బాగుపడుతారని అది ఏ ఎమ్మెల్యే సాధిస్తారో అర్థం కావడం లేదు అంటున్నారు రైతన్నలు.

11 / 13
 గత సంవత్సరం లో టమోటా పంటకు రేట్లు లేక ,మార్కెట్ కు తరలించిన రవాణా ఖర్చులు రాక నడి రోడ్డుపై పరబోసిన సంఘటనలు కూడా ఉన్నాయి.గత నాలబై సంవత్సరాల నుండి మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే పత్తికొండ టామోట్ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం,ఎన్నికల్లో గెలిచిన తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీ విషయాన్ని వదిలివేయడం అలవాటు గా మరిదంటున్నారు

12 / 13
 కర్నూలు జిల్లా ఆస్పరి బిల్లేకల్లు కూరగాయల మార్కెట్ లో గత రెండు రోజుల నుంచి టమోటా ధర పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది.దీంతోబోరు బావుల.పంట పొలాల్లో టమోటాపంట సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కూలీల చేత టమోటాలు తెంచిన కూలీ ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

13 / 13
గత నెల రోజులక్రితం ఆస్పరి, బిల్లేకల్లు కూరగాయల మార్కెట్ లో 20 కిలోలా బాక్స్ లేదా 20 కిలోల గంప ధర రూ 500 నుంచి 800 వరకు ఉండేది. ప్రస్తుతం 20 కిలో ల బాక్స్ ధర 30 నుంచి 50 రూపాయలు మాత్రమే ఉంది. ఆ ప్రకారం కిలో టమోటా ధర రూ 3 నుంచి 5 రూపాయల వరకు ఉండడంతో రైతు లు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు.
(Photo Story: Nagi Reddy, Kurnool Dist, TV9 Telugu)

గత నెల రోజులక్రితం ఆస్పరి, బిల్లేకల్లు కూరగాయల మార్కెట్ లో 20 కిలోలా బాక్స్ లేదా 20 కిలోల గంప ధర రూ 500 నుంచి 800 వరకు ఉండేది. ప్రస్తుతం 20 కిలో ల బాక్స్ ధర 30 నుంచి 50 రూపాయలు మాత్రమే ఉంది. ఆ ప్రకారం కిలో టమోటా ధర రూ 3 నుంచి 5 రూపాయల వరకు ఉండడంతో రైతు లు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. (Photo Story: Nagi Reddy, Kurnool Dist, TV9 Telugu)