
హిందువులు పండుగల్లో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. మరో 24 గంటల్లో వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సారి రెండు రాశుల వారికి మేలు చేయబోతున్నాడు.

వినాయక చవితి సమయంలో కొన్ని గ్రహాల కలయికలు రెండు రాశుల వారికి వరాల వర్షం కురవబోతోంది. ఒక్కసారి వినాయకుడు వీరి జీవితాల్లో ఎంటర్ అయితే అన్ని మారిపోతాయి. ప్రతికూల పరిస్థితులు పోయి సానుకూలమైన ఫలితాలను జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

తులారాశి: చంద్రుడు, శుక్రుడు ఈ రాశిలో బలంగా ఉన్నారు ఇక వీరికి తిరుగులేదు. ఇంకా మీకు మెరుగైన సంబంధాల వలన అదృష్టం మొత్తం మారుతుంది. ఇంకా కొత్తగా ఆర్థిక అవకాశాలు కూడా వస్తాయి. ఈ రాశి వారు మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు.

వృషభ రాశి : వినాయకుడు వలన మొత్తం మంచిగా ఉండబోతోంది. ఇంకా గొప్పగా మారనుంది. కొందరి వ్యక్తుల వలన జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. వ్యాపారాల్లో డబ్బుతో పాటు అధిక లాభాలు వస్తాయి. అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మొత్తం పోతాయి. ఆకస్మిక లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.