
కాగా, ఇప్పుడు జ్యోతిష్య నిపుణులు రాళ్ల పల్లి రవికుమార్ ప్రకారం, అసలు విజయ్ జాతకం ఎలా ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పుట్టిన తేదీ విషయానికి వస్తే, విజయ్ జూన్ 22, 1974లో జన్మించారు. ఈయన పుష్యమి నక్షత్రంలో జన్మించారు. ఈయన మూల సంఖ్య 4. డెస్టినీ నెంబర్ కూడా 4 వచ్చింది. దీంతో ఈయనకు నాలుగు నెంబర్ అనేది అదృష్ట మైనది అని చెప్పాలి.

పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశికి చెందినది, చంద్రడు స్వస్థానంలో ఉంటాడు. ఇక చంద్రుడు అంటేనే మనశాంతి, బుద్ధికారకుడు, మాతృకారకుడు. చంద్రుడు చంచలనం లేకుండా ఉంటుంది. అందువలన విజయ్‌కు తల్లి ఆశీర్వాదం అద్భుతంగా కలిసి వస్తుంది. ఆమె ఆశీర్వాద బలం వల్లనే ఇంతటి విజయం కలిసి వచ్చిందనే చెప్పాలి. విజయ్ జాతకంలో శుక్రుడి స్థానం, రాహువు ప్రభావం అద్భుతంగా ఉండటం వలన సినిమాల్లో అద్భుతంగా కలిసి వచ్చింది.

ఇక విజయ్ జాతకం మొత్తంలో రాహువు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలి అన్నా, రాజకీయంగా కలిసి రావాలి అంటే, వారి జాతకంలో రవి గ్రహం, కుజ గ్రహం , శని గ్రహం మూడు కూడా బాగున్నప్పుడే రాజకీయంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం విజయ్‌కు శుక్ర మహార్ధశ కొనసాగుతుంది. అందువలన ఈయనకు రాజకీయంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే, చంద్రడితో కలిసి కుజుడు ఉండటం, బుధాను గ్రహం ఉండటం , అన్నీ గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వలన ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరే విజయ్ అగ్రస్థానంలో ఉంటాడంట.

అంతే కాకుండా ఈయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ, రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తాడు. కేంద్రం నుంచి మంచి సపోర్టు లభించి చాలా అద్భుతంగా రాజకీయంగా రాణిస్తాడంట. అంతేకాకుండా ఈయనకు రాజకీయంగా చాలా బాగా కలిసి వస్తుందని ఆయన తెలియజేశారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు