
కూరగాయ మొక్కల వల్ల కూడా ఇంట్లో గొడవలు జరిగి భార్యాభర్తలు విడాకులు తీసుకునే వరకు వెళ్తారా? ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఇష్టంగా కూరగాయ మొక్కలను పెంచుకుంటున్నారు. అయితే, ఎక్కువగా గార్డెనింగ్, డాబా మీద మొక్కలు పెంచుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని మీ ఇంట్లో పెంచకపోవడమే మంచిదని చెబుతున్నారు.

నిమ్మచెట్టు: వాస్తు ప్రకారం.. నిమ్మ పవిత్రమైనదిగా చెబుతున్నారు. అయితే, దీనిని ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు. ఇది ముళ్ల చెట్టు.. ఇది మీ ఇంటికి మంచిదే కాదు. కాబట్టి, నిమ్మ మొక్కను ఇంట్లో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.

చాలామంది ఇళ్ళలో గోరింటాకు మొక్కలు బాగా పెంచుతుంటారు. అయితే, వాస్తు నిపుణలు చెప్పిన దాని ప్రకారం దీనిని ఇంట్లో అస్సలు పెంచకూడదని చెబుతున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్ శక్తిని కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, ఈ మొక్కలు ఇంటి లోపల కానీ, చుట్టుపక్కల కానీ వీటిని పెంచకూడదని చెబుతున్నారు.

జామ చెట్టు : చాలా మంది ఇళ్ళలో జామ చెట్లను నాటి రోజూ నీళ్ళను పోసి పెంచుతారు. ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదని అంటున్నారు. ఈ జామ మొక్క మీ ఇంట్లో ఉన్నా కూడా వెంటనే పీకేయండి. ఎందుకంటే, ఇది ఆకులను రాల్చుతుంది. దీని కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి ఇంకా ఇంట్లో వాళ్ళకి సమస్యలు వస్తాయని అంటున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)