
చిలుక రాముడికి సంబంధించి నదిగా చెబుతుంటారు. అంతే కాకుండా వాస్తు ప్రకారం, రామ చిలుకను పెంచుకోవడం కూడా చాలా మంచిదేనంట. ఇంటిలో రామ చిలుకను పెంచుకోవడం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంచుతుంది. అంతే కాకుండా కుటుంబంలో ఆనందాన్ని కూడా తీసుకొస్తుందంట. అందువలన చిలుకను పెంచుకోవడం మంచిది.

అయితే చిలుకను పెంచుకోవడం మంచిదే కానీ, దీనిని పెంచుకునే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో చిలుకలను పెంచుకునే సమయంలో దీనిని ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచుకోవాలి. అప్పుడే దీని వలన ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

ఉత్తర దిశను బుధ గ్రహ దిశగా పరిగణించ వచ్చును. అందువలన చిలుకను ఉత్తర దిశలో ఉంచడం వలన ఇది సానుకూలత ఫలితాలను ఇస్తుంది. తూర్పు దిశను సూర్య భగవానుడి దిశగా పరిగణిస్తుంటారు. అందువలన ఈ రెండు దిశల్లో చిలుకను పెంచుకోవడం వలన ఇది ఆనందం, శ్రేయస్సును కూడా పెంచే ఛాన్స్ ఉందని పండితులు చెబుతున్నారు.

ఇక చాలా మంది చిలుకను తమ ఇంటిలో పెంచుకునే సమయంలో పంజరంలో బంధిస్తే ఇది చాలా ప్రమాదకరం కావచ్చు. మీరు చిలుకను పంజరంలో ఉంచితే, అది మీ కుటుంబంలో సమస్యలను తీసుకొస్తుందంట. అందువలన మీరు చిలకను పంజరంలో బంధిస్తే, అది సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇది మీ ఇంటిలో ప్రతికూలతను పెంచుతుంది.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు అని చెప్పాలి. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది.