సున్నుండ కంటే 10 రెట్లు బలం!  20 రోజులు నిల్వ ఉండే స్వీట్ రోల్

Updated on: Sep 29, 2026 | 8:05 PM

తెలుగువారి సంప్రదాయ తీపి వంటకాల్లో సున్నుండలు అత్యంత బలవర్ధకమైనవిగా పేరుగాంచాయి. అయితే చాలామంది సున్నుండల తయారీలో పంచదార లేదా అధిక మొత్తంలో నెయ్యిని ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా ఎదిగే పిల్లలకు, కండరాల దృఢత్వానికి, శారీరక అలసటను దూరం చేయడానికి సరికొత్త పద్ధతిలో మినప్పప్పు, పెసరపప్పుల కలయికతో పంచదార లేకుండా స్వచ్ఛమైన బెల్లంతో చేసుకునే ప్రోటీన్ స్వీట్ రోల్స్ ఎంతో శ్రేష్ఠమైనవి. 

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, అర కప్పు పెసరపప్పు, నెయ్యిలో వేయించిన కాజు, బాదం, 1½ కప్పుల బెల్లం పొడి, 1½ కప్పుల  నీళ్లు బెల్లం కరిగించడానికి, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు

2 / 5
తయారీ విధానం: పాన్‌లో నూనె లేదా నెయ్యి ఏమీ వేయకుండా ఒక కప్పు మినప్పప్పును వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించాలి. మినప్పప్పు వేగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది; పప్పు మంచి వాసన, రంగు వచ్చాక చివర్లో అర కప్పు పెసరపప్పు వేసి రెండింటినీ కలిపి సమంగా వేయించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి.. అందులోనే నేతిలో వేయించిన కాజు, బాదం ముక్కలు కూడా వేసి మెత్తటి నునుపైన పౌడర్‌లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

3 / 5
పాన్‌లో ఒకటిన్నర కప్పుల బెల్లం పొడి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కరిగించాలి. పాకం పట్టాల్సిన పనిలేదు; బెల్లం కరిగిన తర్వాత ఇసుక, నలకలు లేకుండా స్ట్రైనర్‌తో వడకట్టి పాన్‌లోకి తీసుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిలో మిక్సీ పట్టిన పప్పుల పిండిని వేసి ఉండలు లేకుండా గరిటెతో బాగా కలపాలి. మిశ్రమం కలిసిన తర్వాత ఒక కప్పు పాలను కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌పై 5 నుండి 10 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే నీరంతా ఆవిరై మిశ్రమం చిక్కబడి ముద్దలా దగ్గరకు వస్తుంది. అప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసి కలపాలి; మిశ్రమం పాన్ నుండి వేరుపడగానే స్టవ్ ఆపేయాలి.

4 / 5
కాస్త వేడిగా ఉన్నప్పుడే బటర్ పేపర్‌పై లేదా నెయ్యి రాసిన ప్లేట్‌పై వేసి పిండిని సాఫ్ట్‌గా అదిమి పొడవాటి స్థూపంలా (సిలిండ్రికల్ రోల్) ఎక్కడా పగుళ్లు లేకుండా రోల్ చేసుకోవాలి. బటర్ పేపర్‌పై వేయించిన గసగసాలను పరిచి, ఈ పిండి రోల్‌ను దానిపై దొర్లిస్తే గసగసాలన్నీ రోల్ చుట్టూ చక్కగా అంటుకుంటాయి. ఇప్పుడు బటర్ పేపర్‌తో టైట్‌గా రోల్ చేసి 20 నుండి 30 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో సెట్ అవ్వనివ్వాలి.

5 / 5
ఫ్రిడ్జ్ నుంచి రోల్‌ను తీసి బటర్ పేపర్ విప్పాలి. కత్తితో కట్ చేస్తే అడుగుభాగం ఒత్తిడికి షేప్ మారే అవకాశం ఉంటుంది; అందుకే ఇంట్లో ఉండే సాధారణ కుట్టు దారంతో రోల్ కింద పెట్టి పైకి క్రాస్ చేసి లాగితే పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో అద్భుతమైన బిళ్ళల్లా కట్ అవుతాయి! అంతే, నోరూరించే బలవర్ధకమైన మినప-పెసరపప్పు స్వీట్ రోల్స్ సిద్ధం! రోజుకొకటి తిన్నా ఎంతో బలం, శక్తి చేకూరుతాయి

Loading...
Unable to load recommendations.
Follow Us