
డిమాండ్ ఉన్న రంగం: రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణాలు, ప్లంబింగ్, వ్యవసాయ రంగాల్లో పివిసి పైపుల వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంది. పాత ప్లాస్టిక్ డ్రమ్ములు, ప్లాస్టిక్ బిందెలు, వ్యర్థ పైపు, కంటైనర్లను స్క్రాప్ వ్యాపారుల నుంచి తక్కువ ధరకు సేకరించాలి. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పివిసి పైపులుగా మార్చడం ద్వారా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది.

వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?: యంత్రాలు, స్థలం కావాలి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్, మిక్సింగ్ మిషన్, పివిసి ఎక్స్‌ట్రూడర్ యంత్రం, వాటర్ కూలింగ్ ట్యాంక్, కట్టింగ్ మిషన్లు అవసరమవుతాయి. మిషనరీ ఏర్పాటుకు కొంత విశాలమైన ప్రదేశం కావాలి.

తయారీ విధానం: సేకరించిన పాత ప్లాస్టిక్ డ్రమ్ములను చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసి, తగిన రసాయనాలు, కలర్ గ్రాన్యూల్స్‌తో కలిపి ఎక్స్‌ట్రూడర్ మిషన్‌లో వేస్తారు. వేడి ద్వారా కరిగిన ప్లాస్టిక్ డై ద్వారా పైపు ఆకారంలోకి వచ్చి, చల్లటి నీటిలో గట్టిపడి కట్ అవుతుంది.

పెట్టుబడి, లాభాలు: యంత్రాల సామర్థ్యాన్ని బట్టి ఈ వ్యాపారానికి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ప్రాథమిక పెట్టుబడి అవసరమవుతుంది. పాత ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా తయారీ వ్యయం చాలా తక్కువగా ఉండటం వల్ల లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది.

స్థానిక ప్లంబింగ్ షాపులు, హార్డ్‌వేర్ స్టోర్లు, బిల్డర్లు, రైతులకు నేరుగా సరఫరా చేయడం ద్వారా నెలకు రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షలకు పైగా నికర లాభం పొందవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎంఎస్‌ఎంఈ కింద రుణాలు, సబ్సిడీలను కూడా అందిస్తున్నాయి. సరియైన వ్యాపార ప్రణాళికతో అడుగుముందుకు వేస్తే ఇది మంచి లాభదాయకమైన స్వయం ఉపాధి మార్గంగా మారుతుంది.