
ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎక్కువ సంపాదించే వ్యక్తి ఎప్పుడూ కూడా ధనవంతుడు కాలేడు, ఎవరు అయితే తెలివిగా పెట్టుబడులు పెడుతుంటారో, వారే నిజమైన ధనవంతులు అని, అందువలన మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నదానికంటే, దానిని ఎలా పెట్టుబడి పెట్టి, ఎంత వరకు పొదుపు చేస్తున్నాం అనేదే ముఖ్యం. అయితే ఒక లక్ష రూపాయలతో పదిలక్షలు సంపాదించడం ఒక రోజులో లేదా ఒక రాత్రిలో అవ్వదు, కొన్ని సంవత్సరాలు, తెలివైన పెట్టుబడుల వలన అంత సంపాదించుకోవచ్చు.

తెలివిగా బిజినెస్ చేయడం వలన మీరు లక్ష రూపాయల నుంచి పదిలక్షలు సంపాదించుకోవచ్చునుంట. ముఖ్యంగా ఒక లక్ష రూపాయలతో ఫుడ్ క్లౌడ్ కిచెన్ ప్రారంభించడం, ఇలా చేయడం వలన కేవలం రెండు సంవత్సరాల్లో 10లక్షలు సంపాదించుకోవచ్చు. ఇవే కాకుండా చిన్న చిన్న బిజినెస్‌లు చేయవచ్చు.

అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఒక లక్ష రూపాయలను ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కాకుండా, Mutual Funds (Nifty 50 Index Fund) లో SIP లా పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చునంట. ఒక లక్షను ఒకేసారి పెట్టి ప్రతి సంవత్సరం 15 శాతం రిటర్న్ వస్తే అది 10 లక్షలు అవ్వడానికి దాదాపు 16 సంవత్సరాలు పడుతుంది.

అయితే అదే లక్ష రూపాయలను నెలకు 5000 చొప్పున పెట్టి ప్రతి నెల యాడ్ చేస్తూ పోవడం వలన 7 లేదా 8 సంవత్సరాల్లో పది లక్షల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చునంట. అంతే కాకుండా లక్షరూపాయలను 50 వేలుగా 50 వేలుగా విడగొట్టాలి. అందులో 50 వేలతో బిజినెస్ పెట్టాలి. అది ప్రతి నెలా మీకు ఆదాయం తీసుకొస్తుంది. ఇంకో 50 వేలను నిప్టీలో పెట్టి మర్చిపోవాలి. అంతే దాదాపు 10, 12 సంవత్సరాలలో అది మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువ అవుతుంది.

ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో మీరు లక్ష రూపాయలతో సులభంగా ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవచ్చును. అయితే కొంత మంది ఎక్కువగా మనీ ఆదా చేయాలి అని ట్రేడింగ్, క్రిప్టోలో వంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం, లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వడ్డీలకు ఇవ్వడం చేస్తుంటారు. కానీ దీని వలన ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అందువలన ఇవేవి చేయకుండా తెలివిగా పెట్టుబడి పెట్టడం చేయాలంట.