ఇంట్లో తులసి కోట ఉందా? ఏ దిశలో పెట్టాలి.. ఆకులు ఎవరు కోయాలి? అసలు నియమాలు ఇవే!

Updated on: Nov 17, 2026 | 8:58 AM

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఇంటా తులసి కోటను ఏర్పాటు చేసి నిత్యం పూజిస్తారు. వాస్తు ప్రకారం, తులసి మొక్క వాడిపోతే అశుభమని భయపడాల్సిన అవసరం లేదని, మట్టి దోషం లేదా నీటి కొరత వల్ల అలా జరుగుతుందని ప్రవచనకర్తలు స్పష్టం చేస్తున్నారు. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే తులసి కోట వద్ద సంధ్యాదీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
భారతీయ సంప్రదాయంలో తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి నిత్యం పూజిస్తారు. అయితే తులసి కోటను ఏ దిశలో ఉంచాలి? ఆకులను ఎవరు తెంపాలి? మొక్క ఎండిపోతే ఏదైనా కీడు జరుగుతుందా? వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వీటికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి అందించిన స్పష్టమైన సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
తులసి కోట ఉండాల్సిన సరైన దిశ ఏది?: ఉదయం నిద్రలేచి తలుపు తీయగానే తులసి మొక్కను దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. అందుకే ఇంటి గుమ్మానికి ఎదురుగా లేదా బయటకు వెళ్లేటప్పుడు ఎడమచేతి వైపు తులసి కోటను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. స్థలం వీలు కాకపోతే ఇంటికి ఉన్న ఎనిమిది దిక్కులలో ఎక్కడైనా తులసి కుండీని పెట్టుకోవచ్చు. ఇక అపార్ట్‌మెంట్లలో నివసించే వారు తూర్పు వైపు బాల్కనీ ఉంటే నైరుతి మూలలో, పడమర వైపు బాల్కనీ ఉంటే వాయవ్య దిశలో తులసి మొక్కను ఉంచుకోవడం మంచిది.

3 / 5
తులసి మొక్క వాడిపోతే అశుభానికి సంకేతమా?: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఏదో అరిష్టం జరుగుతుందని చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మట్టిలో దోషం ఉండటం, ఎండ సరిగ్గా తగలకపోవడం, నీళ్లు ఎక్కువ లేదా తక్కువ అవ్వడం వంటి ప్రకృతి కారణాల వల్లే మొక్క వాడిపోతుంది. కుండీ చివరన ఒక చిన్న మనీప్లాంట్ కొమ్మను నాటితే, అది మట్టిలోని దోషాలను గ్రహించి తులసి మొక్క ఏపుగా పెరిగేలా చేస్తుంది.

4 / 5
పూజ, దీపారాధన నియమాలు: ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. దీనిని సంధ్యాదీపం అంటారు. కేవలం శ్రీమన్నారాయణుడి పూజ కోసం మాత్రమే తులసి దళాలను ఉపయోగించాలి. మాతృత్వానికి, పోషణకు ప్రతీక అయిన స్త్రీలు తులసి ఆకులను తెంపకూడదని పెద్దలు నియమం పెట్టారు. పురుషులు మాత్రమే దళాలను కోయాలి.

5 / 5
రకాలు, దానం: ఇంట్లో లక్ష్మీ తులసి, రామ తులసి లేదా కృష్ణ తులసిని పెంచుకోవచ్చు. అలాగే తులసి మొక్కలను ఇతరులకు పంచడం వల్ల మన ఇంట్లోని లక్ష్మి వెళ్లిపోతుందనే భయం అక్కర్లేదు. సంతోషంగా ఇతరులకు ఇవ్వడం వల్ల శుభమే జరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us