Oils Benefits: వేడితో బాధపడుతున్నారా..? కూల్ కూల్‌గా ఉండేందుకు ఈ నూనెలతో తలకు మాసాజ్ చేయండి

|

Apr 20, 2022 | 8:30 AM

Benefits of Oils: వేసవిలో బయట తిరుగుతారు. దీనివల్ల వేడి చేస్తుంది. అయితే.. వేడి అనిపించగానే చాలా మంది చల్లాగా ఉండేందుకు.. తలకు పలు నూనెలు రాసి.. మసాజ్ చేస్తారు. కొన్ని నూనెలతో మసాజ్ చేయడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి సందర్భంలో రిలాక్స్‌గా ఉండేందుకు ఎలాంటి (Best Hair Oils To Use In Summer) నూనెల సహాయం తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

1 / 6
బాదం నూనె: వేసవిలో ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల మీరు రిలాక్స్‌ అవ్వవచ్చు. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఈ నూనెతో వారానికి రెండుసార్లు తలపై మసాజ్ చేయండి.

2 / 6
ఆలివ్ ఆయిల్: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ నూనెలో జుట్టుకు మేలు చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో మసాజ్ చేయడం వల్ల మంచి అనుభూతిని కలిగిస్తుంది. వేసవిలో ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఈ నూనెతో మసాజ్ చేస్తే చాలామంచిది.

3 / 6
కొబ్బరి నూనె: చర్మం, జుట్టు సంరక్షణలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. కొబ్బరి నూనెలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. దీనితో తలతోపాటు శరీరానికి మసాజ్ చేస్తే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది.

4 / 6
అవకాడో ఆయిల్: ఈ నూనెలో విటమిన్లు బి, ఎ, డి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది దుమ్ము, కాలుష్యం నుంచి జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది. జుట్టుకు షాంపూతో మసాజ్ చేయడం వల్ల అనేక హెయిర్ బెనిఫిట్స్ లభిస్తాయి.

5 / 6
జోజోబా ఆయిల్: ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల మీరు రిలాక్స్‌గా ఉండటమే కాకుండా, జుట్టు పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టును అనేక సమస్యల నుంచి కాపాడుతాయి.

6 / 6
ఈ నూనెలతో మసాజ్ చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గడంతోపాటు.. జట్టుకు మేలు జరుగుతుంది.