Travel and food: దేశరాజధాని ఢిల్లీలో దక్షిణభారత ఫుడ్ కోసం వెదుకుతున్నారా.. ఈ రెస్టారెంట్స్ ట్రై చేయండి

|

Jun 03, 2022 | 4:46 PM

Travel and food: భారతీయులు ఆహారప్రియులు. ముఖ్యంగా దక్షిణ భారతీయ ఆహారపదార్ధాలు ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో రుచికరమైన దక్షిణ భారత ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటే.. ఈ రెస్టారెంట్లను ట్రై చేయండి.

1 / 5
ఢిల్లీ టేస్టీ ఫుడ్స్‌కు ప్రసిద్ధి చెందింది. అనేక రకాల రుచికరమైన వంటకాలు ఇక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా చాలా మంది ప్రజలు దక్షిణ భారత ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. దోశ, ఇడ్లీ వంటి దక్షిణ భారత ఆహారాన్ని ఇష్టపడేవారైతే.. ఢిల్లీలోని ఈ రెస్టారెంట్లలో  ఆస్వాదించవచ్చు.

2 / 5
జాంబర్ రెస్టారెంట్: దీనికి ఢిల్లీలో అనేక బ్రాంచీలున్నాయి. వాటిలో ఒకటి కైలాష్ తూర్పులో కూడా ఉంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఈ రెస్టారెంట్‌లో మసాలా దోశ, ఉడిపి మసాలా దోశ ఇతర ఆహారపదార్ధాలను రుచి చూడటానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు. జాంబర్ రెస్టారెంట్ లో రసం అన్నం చాలా ప్రసిద్ధి చెందింది.

3 / 5
ఆంధ్రాభవన్: టేస్టీ సౌత్ ఇండియన్ ఫుడ్ విషయానికి వస్తే.. వెంటనే ఢిల్లీలోని ఆంధ్రా భవన్ ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది. ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ క్యాంటీన్‌లలో ఒకటైన ఆంధ్ర భవన్‌లోని సాంబార్ రుచి చూడటానికి ప్రజలు ఇక్కడకు వస్తారు. మీరు ఇక్కడ తక్కువ ధరలో ఆహారపు థాలీని ఆస్వాదించవచ్చు.

4 / 5
కర్నాటక కేఫ్: కేఫ్‌లోని సౌత్ ఇండియన్ ఫుడ్ డిఫరెంట్‌ రుచిలో దర్శనమిస్తుంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని కర్ణాటక కేఫ్ మంచి నాణ్యమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. మీరు ఇక్కడ మెనులో చాలా ఆహార పదార్థాలు అన్ని రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మసాలా దోశ చాలా రుచిగా ఉంటుంది.

5 / 5
కోస్ట్ కేఫ్: ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో ఉన్న ఈ రెస్టారెంట్‌లో మీరు కేరళలోని రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇక్కడ ఆహారం కొంచెం ఖరీదైనది. రుచి, నాణ్యత బట్టి చూస్తే.. ఆహారానికి పెట్టె ఖరీదు పెద్దలెక్కలోని కాదని ఆహారప్రియులు అంటారు.