పాస్‌పోర్ట్ అక్కర్లేదు.. వీసా అసలే వద్దు! విదేశాలను తలపించే అద్భుతమైన ప్రదేశాలు మనదేశంలోనే..

Updated on: Mar 28, 2026 | 7:24 PM

చాలా మందికి విదేశీ పర్యటనలు చేయాలని, అక్కడి అందాలను చూడాలని కోరిక ఉంటుంది. కానీ, భారీ ఖర్చులు, వీసా ఇబ్బందుల వల్ల ఆ కల నెరవేరదు. అయితే, మన భారతదేశంలోనే విదేశీ లొకేషన్లను తలపించే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? స్విట్జర్లాండ్ లాంటి మంచు కొండలు, ఫ్రాన్స్ లాంటి వీధులు, స్కాట్లాండ్ లాంటి పచ్చని ప్రకృతి దృశ్యాలు మన దేశంలోనే కనువిందు చేస్తాయి. కాశ్మీర్ నుండి కేరళ వరకు, గుజరాత్ నుండి మేఘాలయ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలు పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని మిగిలిస్తాయి. ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు, ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రదేశాలు స్వర్గధామాలు. పాస్‌పోర్ట్, వీసా అవసరం లేకుండానే విదేశీ యాత్ర చేసిన అనుభూతిని పొందడానికి ఈ 7 ప్రదేశాలు సరైన ఎంపిక. మీ తదుపరి ట్రిప్‌ను ప్లాన్ చేసుకునే ముందు ఆయా ప్రదేశాలేంటో తప్పక తెలుసుకోండి. భారత్ ఎంత అందమైనదో మీకే అర్థమవుతుంది.

1 / 7
గుల్మార్గ్, కాశ్మీర్ (Mini Switzerland): మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన పచ్చిక బయళ్లతో గుల్మార్గ్ సరిగ్గా స్విట్జర్లాండ్‌ను తలపిస్తుంది. ఇక్కడి గొండోలా రైడ్ (Gondola Ride) మీకు ఆల్ప్స్ పర్వతాల్లో విహరిస్తున్న అనుభూతిని ఇస్తుంది.

2 / 7
 కూర్గ్, కర్ణాటక (Coorg-Feels like Scotland): పచ్చని కాఫీ తోటలు, పొగమంచుతో నిండిన కొండలు చూస్తుంటే మీరు స్కాట్లాండ్ లో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది సరైన గమ్యస్థానం. ట్రెక్కింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ కచ్చితంగా నచ్చుతుంది.

3 / 7
 ఆలేప్పి, కేరళ (Venice of the East): కేరళలోని బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్ ప్రయాణం ఇటలీలోని వెనిస్ నగరాన్ని గుర్తు చేస్తాయి. కాలువల గుండా సాగే ప్రయాణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

4 / 7
పాండిచ్చేరి (Pondicherry- Feels like France): ఇక్కడి వైట్ టౌన్ లోని పసుపు రంగు భవనాలు, ఫ్రెంచ్ శైలి వీధులు మిమ్మల్ని నేరుగా ఫ్రాన్స్‌కు తీసుకెళ్తాయి. ఇక్కడి సంస్కృతి, ఆహారం కూడా ఫ్రెంచ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

5 / 7
సుందరమైన బీచ్‌లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం లక్షద్వీప్ ప్రత్యేకత. ఇక్కడి నీలి రంగు సముద్ర జలాలు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటాయి. అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ అనేది 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి ‘లక్షద్వీప్’ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ‘లక్కదివ్’ అని పిలిచేవారు.

6 / 7
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న ఔలి, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. హిమాలయాల గర్వాల్ శ్రేణిలో ఉన్న ఈ ప్రాంతం, మంచు క్రీడలకు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు మారుపేరు. మంచు అందాల కోసం వెళ్లేవారు డిసెంబర్ నుండి మార్చి వరకు, ప్రకృతి అందాల చూసేందుకు వెళ్లేవారు ఏప్రిల్ నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు వెళితే మీరు కోరుకున్న  సంతృప్తిని పొందుతారు.

7 / 7
థార్ ఎడారి, రాజస్థాన్ (Sahara vibes): ఒంటెల ప్రయాణం, ఇసుక తిన్నెలను చూస్తుంటే ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయం అద్భుతంగా ఉంటుంది.
 మన దేశంలోని వైవిధ్యం నిజంగా ఆశ్చర్యకరం.

థార్ ఎడారి, రాజస్థాన్ (Sahara vibes): ఒంటెల ప్రయాణం, ఇసుక తిన్నెలను చూస్తుంటే ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయం అద్భుతంగా ఉంటుంది. మన దేశంలోని వైవిధ్యం నిజంగా ఆశ్చర్యకరం.

Follow Us