Pesara Kattu: నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. శరీరానికి చలువ చేసే కమ్మటి పెసర కట్టు

Updated on: Sep 27, 2026 | 2:32 PM

 వేసవి తీవ్రమైన ఎండల సమయంలో ఒంట్లో వేడి చేసి నోటికి ఏ పదార్థమూ సహించనప్పుడు పూర్వీకులు చేసుకునే అత్యుత్తమ వంటకం 'పెసర కట్టు'. చాలామంది పెసరపప్పు చారు, పెసర కట్టు రెండూ ఒకటే అనుకుంటారు; కానీ రెండింటికీ చాలా తేడా ఉంది. పెసరపప్పు చారులో చింతపండు, రసం పొడులు వేస్తే.. పెసర కట్టులో చింతపండు రసం అస్సలు వేయరు. పెసరపప్పు చలువ చేసే గుణం కలిగి ఉండి, సులభంగా జీర్ణమవుతుంది.

1 / 5
కావలసిన పదార్థాలు: 1 చిన్న కప్పు పెసరపప్పు, సుమారు 80 గ్రాములు, సన్నగా కట్ 1 ఇంచ్ అల్లం తరుగు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పప్పు ఉడికించడానికి 1 పెద్ద గ్లాసు నీళ్లు ఆ తర్వాత కలపడానికి మరో 1 గ్లాసు నీళ్లు, కావాలనుకుంటే చల్లారాక వేసుకోవడానికి కొద్దిగా నిమ్మరసం . ఘుమఘుమలాడే తాలింపు కోసం: 1-2 చెంచాలు నూనె, 7-8 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు , అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, 3 తుంచిన ఎండుమిర్చి, తాజా కరివేపాకు

2 / 5
తయారీ విధానం: ఒక చిన్న కప్పు (80 గ్రాములు) పెసరపప్పును తీసుకుని నీటితో రెండు సార్లు శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో కడిగిన పప్పు వేసి, ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోయాలి. ఇందులో సన్నగా తరిగిన ఒక ఇంచ్ అల్లం ముక్కలు, పావు టీస్పూన్ పసుపు వేసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి హై ఫ్లేమ్‌పై 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పెసర కట్టుకు పప్పు ఎంత మెత్తగా వెన్నలా ఉడికితే కట్టు అంత కమ్మగా వస్తుంది.

3 / 5
 ఆవిరి పోయాక మూత తీసి పప్పును గరిటెతో మెత్తగా మెదపాలి. ఇప్పుడు ఇందులో మరో పెద్ద గ్లాసు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మీడియం మంటపై 5 నిమిషాల పాటు మరిగించాలి. పెసర కట్టు మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని పల్చటి నీళ్లలా ఉండకూడదు; కాస్త చిక్కదనంతో క్రీమీగా ఉండాలి.

4 / 5
చిన్న పాన్‌లో నూనె వేడిచేసి కచ్చాపచ్చాగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు వేయాలి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే కట్టు వాసన బాగుంటుంది. వెల్లుల్లి వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపును మరుగుతున్న పెసర కట్టులో వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి.

5 / 5
పులుపు ఇష్టపడేవారు కట్టు కాస్త గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. అంతే, నోరూరించే కమ్మటి పెసర కట్టు సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెసర కట్టు కలుపుకుని, నంజుకోవడానికి గుమ్మడి వడియాలు, పొట్ల వడియాలు లేదా చల్ల మిరపకాయలతో తింటుంటే తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us