
ప్రస్తుతం ఎక్కడా చూసిన టిఫిన్ సెంటర్లు నడుస్తున్నాయి. కొందరికి చట్నీ మంచిగా ఉంటే చాలు రోజూ అదే టిఫిన్ దగ్గరికి వెళ్తారు. ఇంకొందరు కేవలం అల్లం పచ్చడి కోసమే వెళ్తారు. ఇది మంచిగా ఉంటే దోశలు, ఇడ్లీలు ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

పురాతన కాలం నాటి అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అల్లం ముక్కలు, ఎండుమిర్చి నాలుగు, కొద్దిగా చింతపండు, 50 గ్రాముల బెల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు , కొద్దిగా కొత్తిమీరను తీసుకోండి.

పురాతన కాలం నాటి తయారీ విధానం: ఒక పాన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు అల్లం ముక్కలను కూడా వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత మూడు ఎండుమిర్చి, నాలుగు జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 10 నిముషాల పాటు బాగా వేయించాలి. అల్లం ముక్కలను పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించాలి

ఇది ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లార్చిన తర్వాత కొద్దిగా చింతపండు, బెల్లం, ఉప్పుతో వేసి బాగా గట్టిగా ఉండేలా దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా పోపు పెట్టుకోవాలి. ఈ తాలింపును తీసుకుని చట్నీలో వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గొంతు నొప్పికి ఇది చెక్ పెడుతుంది.

ఇది తాగడం వలన హెల్త్ బెనిఫిట్స్ ఇవే : అల్లం గొంతు నొప్పి, జలుబు తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. నీరసం, అలసట ఉన్నవారు దీనిని తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు అనేక సమస్యలను కూడా తరిమికొడుతోంది.