టాప్ లోడ్ Vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్.. మీ ఇంటికి ఏది బెస్ట్.. కొనే ముందు ఇవి తెలుసుకోండి..

Updated on: Jan 05, 2026 | 8:05 PM

Top Load vs Front Load Washing Machine: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు చాలామంది టాప్ లోడ్ తీసుకోవాలా లేక ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా అనే అయోమయంలో ఉంటారు. రెండూ బట్టలు ఉతికేవే కదా అనుకుంటే పొరపాటే.. వీటి పనితీరు, ఖర్చు, నిర్వహణలో చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్: ఫ్రంట్ లోడ్ మెషిన్లు బట్టలను నిలువుగా తిప్పే టెక్నాలజీతో పనిచేస్తాయి. మొండి మరకలను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది టాప్ లోడ్ కంటే తక్కువ నీటిని, తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఫలితంగా కరెంట్ బిల్లు తగ్గుతుంది. బట్టలను చాలా సున్నితంగా ఉతుకుతుంది. కాబట్టి దుస్తులు త్వరగా పాడవవు. ఇవి పని చేస్తున్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి.

2 / 5
ఫ్రంట్ లోడ్ లోపాలు: ఇవి ధరలో కొంచెం ఖరీదైనవి. కొన్ని లేటెస్ట్ మోడల్స్ మినహా మధ్యలో బట్టలు వేయడం కుదరదు. లోపల తేమ వల్ల బూజు పట్టే అవకాశం ఉంది. అందుకే వాడిన తర్వాత డోర్ కాసేపు తెరిచి ఉంచాలి.

3 / 5
టాప్ లోడ్ వాషింగ్ మెషిన్: మన దేశంలో చాలామంది వీటినే ఇష్టపడతారు. ఇందులో బట్టలను పైనుండి వేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ లోడ్ మెషిన్లతో పోలిస్తే ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. ఉతికే ప్రక్రియ మధ్యలో కూడా మరికొన్ని బట్టలు జోడించే వీలుంటుంది. ఇందులో నీరు త్వరగా ఆవిరైపోతుంది కాబట్టి బూజు పట్టే సమస్య తక్కువ.

4 / 5
టాప్ లోడ్ లోపాలు: ఇవి బట్టలను కొంచెం కఠినంగా ఉతుకుతాయి. నీరు, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. బట్టలు ఉతికిన తర్వాత ఎక్కువ తేమగా ఉంటాయి. కాబట్టి ఎండబెట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది.

5 / 5
 ఏది ఎంచుకోవాలి : మీరు అపార్ట్‌మెంట్‌లో ఉంటూ నీటి పొదుపు, తక్కువ శబ్దం కోరుకుంటే ఫ్రంట్ లోడ్ బెస్ట్ ఆప్షన్. మీ బడ్జెట్ తక్కువగా ఉండి మధ్యలోనూ బట్టలు వేయాలనుకుంటే టాప్ లోడ్ సరైన ఎంపిక. మెషిన్ ఏదైనా సరే.. వాడే విధానంపైనే దాని జీవితకాలం ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.