షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. అన్నంతో ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు

Updated on: Oct 06, 2026 | 7:28 AM

షుగర్ వ్యాధి ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుందని, వాటికీ మందులు తప్పవని ఇంకా ఇది వంశపారంపర్యంగా వస్తుందని చాలా మంది అనుభవిస్తారు. అయితే ఇలా చేస్తే మీ షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. మీరు ఈ అలవాట్లను పాటిస్తే షుగర్ అనే మాట ఉండదు. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

మనం అధికంగా పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, అవి శరీరంలో చక్కెరగా మారి రక్తంలో చేరుతాయి. ఖర్చు పెట్టే చక్కెర కంటే రక్తంలోకి చేరే చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో పేరుకుపోయి షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ప్రస్తుత  జీవనశైలిలో పొద్దున్నే ఇడ్లీ, వడ, దోశ, పూరీ  వంటి వాటిని తింటారు. ఇవి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు. మధ్యాహ్నం, రాత్రి తెల్లటి అన్నం తినడం కూడా ఇదే కోవలోకి వస్తుంది, ఎందుకంటే వైట్ రైస్‌లో 77% వరకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇలా మూడు పూటలా అధిక పిండి పదార్థాలను తీసుకుని, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుకుంటూ, ఆ తర్వాత మందులు వేసుకుని నియంత్రించుకోవడం ఒక ప్రక్రియగా మారుతుంది.

2 / 5

డాక్టర్లు మందులు రాసేటప్పుడు "టిఫిన్ తినే ముందు ఈ మాత్ర వేసుకోండి" అని చెప్తారు. దీని అర్థం, మీరు తినే ఆహారం వల్ల చక్కెర పెరుగుతుంది కాబట్టి, అది పెరగకుండా ముందుగానే మందు తీసుకోమని. సమస్య మూలాన్ని మార్చకుండా, దాని లక్షణాలను మందుల వలన నియంత్రించడం తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం  వలన షుగర్ వ్యాధికి తగ్గించుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని లేదా తక్కువగా పెంచే ఆహారాలను ఎంచుకోవాలి. అన్నం, ఇడ్లీ వంటి వాటిని తక్కువగా తీసుకోండి. కడుపు నిండా కూరలు తినండి. ఆకుకూరలు, పెసరపప్పుతో చేసిన కూరలు, గింజల కూరలు అధికంగా తీసుకోవాలి. కందిపప్పు పొడిని మీరు అన్నంలో ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే అస్సలు పెరగదు. వీటిలో తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి చక్కెర స్థాయిలు పెరగవు.

4 / 5

డిన్నర్ లో అన్నం, చపాతీలకు బదులుగా వాల్ నట్స్, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పులు వంటి తీపి లేని గింజలు, నట్స్ తినండి. వీటిలో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు ఉంటాయి కానీ చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.జామకాయ, దానిమ్మ, రేగుకాయ, కమలా, పుచ్చకాయ, బొప్పాయి వంటి తక్కువ చక్కెర ఉన్న పండ్లను తీసుకోండి. వీటిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి.

5 / 5

ఈ ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఇంకా మందుల అవసరం లేకుండానే షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. పేరెంట్స్ కు షుగర్ ఉన్నప్పటికీ, మన ఆహార నియమాలను మార్చుకోవడం వలన  మనకు రాకుండా చూసుకోవచ్చు. షుగర్ వ్యాధి జీవితాంతం ఉండాలా?  దాని నుంచి బయట పడాలా అనేది మన చేతుల్లోనే ఉందని అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us