
కావలసిన పదార్థాలు: పావు కిలో బియ్యం, నీళ్లు, 20 గ్రాముల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, ⅓ కప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అర టీస్పూన్ ఇంగువ. తయారీ విధానం: పావు కిలో బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలి. బియ్యం ఎంత బాగా నానితే అన్నం అంత మెత్తగా, గుజ్జుగా ఉడుకుతుంది.

గంట నానిన బియ్యాన్ని కుక్కర్లో వేయాలి. బియ్యానికి నాలుగు రెట్లు (1 లీటర్) నీరు మరియు 20 గ్రాముల ఉప్పు వేసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై 5 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని చాలా మెత్తగా ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి గరిటెతో అన్నాన్ని మెదుపుతూ మెతుకు నలిగేలా కలపాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడుకుతున్న ఈ ముద్ద అన్నంలోకి మరో అర లీటర్ మరిగే వేడి నీటిని పోసి గరిటెతో బాగా కలిపి పలుచగా, మృదువైన జారుడు ముద్దలా చేసుకోవాలి.

రోట్లో 2 టేబుల్ స్పూన్ల నాణ్యమైన నల్ల మిరియాలను వేసి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కచ్చాపచ్చాగా బరకగా దంచి పక్కన పెట్టుకోవాలి.తిరుమల ఆలయ స్ట్రాంగ్ మిరియాల ఘాటు ప్రకారం అయితే 8.5 గ్రాములు సరిపోతుంది.

స్టవ్పై మూకుడు పెట్టి ⅓ కప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేడిచేయాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అర టీస్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ నెయ్యిలో ఒక్కసారి పొంగగానే వెంటనే స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపకపోతే ఇంగువ మాడిపోతుంది. స్టవ్ ఆపిన వెంటనే.. దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఆ వేడి నెయ్యిలో వేసి కలపాలి; ఆ వేడి నెయ్యికే మిరియాలు చక్కగా వేగి కమ్మటి సువాసన వస్తుంది.

ఈ గుమగుమలాడే మిరియాల ఇంగువ నెయ్యిని వేడివేడిగా ఉన్న ముద్ద అన్నంలో పోసి గరిటెతో అన్నం అంతటా సమంగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. అంతే, సాక్షాత్తూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదించే పవిత్ర 'మరీచి అన్నం' ప్రసాదం సిద్ధం! మిరియాల ఘాటు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రసాదాన్ని పిడికెడు పరిమాణంలో తింటేనే శరీరానికి