Tired After Waking Up: పొద్దున్నే నిద్ర లేచాక మీకూ నీరసంగా అనిపిస్తుందా? వీటిపై దృష్టి పెట్టండి

|

Aug 05, 2024 | 12:55 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిళ్లు 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం. కొంచెం తక్కువ నిద్రపోతే మరుసటి రోజు ఉదయం యాక్టివ్‌గా ఉండలేరు. కానీ రోజూ ఇలాగే అనిపిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. చాలా మంది సాయంత్రం పూట టీ, కాఫీలు తాగుతుంటారు. ఇలాంటి వారు రాత్రిపూట నిద్రపోవడం కష్టం. సరిగ్గా నిద్రపోకపోతే, ఆందోళన పెరుగుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు కెఫిన్‌తో కూడిన పానీయాలకు దూరంగా..

1 / 5
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిళ్లు 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం. కొంచెం తక్కువ నిద్రపోతే మరుసటి రోజు ఉదయం యాక్టివ్‌గా ఉండలేరు. కానీ రోజూ ఇలాగే అనిపిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. చాలా మంది సాయంత్రం పూట టీ, కాఫీలు తాగుతుంటారు. ఇలాంటి వారు రాత్రిపూట నిద్రపోవడం కష్టం. సరిగ్గా నిద్రపోకపోతే, ఆందోళన పెరుగుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు కెఫిన్‌తో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

2 / 5
ఒక్కోసారి కారణం లేకుండానే బలహీనంగా అనిపిస్తుంది. రాత్రి బాగా నిద్రపోయినా, ఉదయాన్నే శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. నిద్రలేవడానికి, పని చేయడానికి శక్తి సరిపోదు. రోజంతా ఆవులిస్తూ ఉంటారు. అలాంటి సమస్య ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

3 / 5
రాత్రిళ్లు కనీసం 6-7 గంటలు నిద్రపోవాలి. కానీ రాత్రిపూట పదే పదే నిద్రలేచేవారు, నిద్రపోయే ముందు ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగించేవారు నిద్ర నాణ్యతతో రాజీ పడవలసి ఉంటుంది. దీని వల్ల కూడా శరీరంలో అలసట కనిపించవచ్చు. నిద్ర చక్రం సక్రమంగా నిర్వహించడం చాలా అవసరం. సరైన సమయానికి నిద్రపోవడం, మేల్కొవడం రెండూ ముఖ్యమైనవే. నిద్రపోయే ముందు తగినంత నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, శారీరక అలసట పెరుగుతుంది.

4 / 5
చాలా సార్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటి వారు 10 గంటలు నిద్రపోయినా, మీ శారీరక అలసట తగ్గదు. శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదలవుతుంది. ఈ ఒత్తిడి హార్మోన్లు నిద్ర నాణ్యత, వ్యవధిని కూడా తగ్గిస్తాయి. దీంతో నిద్రపోవడం ఆలస్యం అవుతుంది.

5 / 5
థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యత సమస్యలు కూడా శారీరక అలసటను కలిగిస్తుంది. ఈ హార్మోన్ల సమస్య మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇలాంటప్పుడు రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా రిఫ్రెష్ గా అనిపించదు. అలాగూ విటమిన్ డి, ఐరన్ వంటి పోషకాల లోపం వల్ల శారీరక అలసట పెరుగుతుంది. ఈ రకమైన పోషకాహారం మానసిక స్థితిని మారుస్తుంది. శరీరంలో శక్తి తగ్గుతుంది. అప్పుడు 7 గంటల నిద్ర తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లు కనిపిస్తుంది. పని చేయడానికి తగినంత శక్తి ఉండదు.