Watermelon: పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు పండిందో లేదో తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నరా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

|

May 21, 2023 | 8:01 AM

పుచ్చకాయ చూడటానికి బాగానే ఉన్నా..లోపల ఎర్రగా ఉందా లేదా? తీపిగా ఉందా లేదా? అన్న విషయం తెలీదు. అందుకే పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. మీకు కూడా అలాంటి సందర్భంలో మీకు సాయం చేసే చిట్కాలు మీకు అందిస్తున్నాం. ఈసారి పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు మీరు వీటిని పరిశీలించి తీసుకోండి. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి..

1 / 9
సహజ పద్ధతిలో వేసవి దాహాన్ని తీర్చే వాటిల్లో బెస్ట్ ఫ్రూట్ పుచ్చకాయ. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. దీనిలో శరీరానికి మంచి చేసే అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ పుచ్చకాయలో కోసి చూసే వరకూ దాని నాణ్యత మనకు అర్థం కాదు.

2 / 9
కాయ చూడటానికి బాగానే ఉన్నా..లోపల ఎర్రగా ఉందా లేదా? తీపిగా ఉందా లేదా? అన్న విషయం తెలీదు. అందుకే పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. మీకు కూడా అలాంటి సందర్భంలో మీకు సాయం చేసే చిట్కాలు మీకు అందిస్తున్నాం. ఈసారి పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు మీరు వీటిని పరిశీలించి తీసుకోండి. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి..

3 / 9
కాయ మొత్తం ఓకే రూపంలో ఉండాలి: పండిన పుచ్చకాయ ఆకారం, పరిమాణంలో ఏకరీతిగా ఉండాలి. దానిపై ఎటువంటి గాయాలు, కోతలు లేకుండా చూసుకోవాలి. ఒకవైపు మాత్రమే చూస్తే.. మరో వైపు అది పక్వానికి రాకపోయి ఉండవచ్చు. అందుకే కాయ మొత్తం పూర్తిగా తిప్పి చూసుకోవాలి.

4 / 9
ఫీల్డ్ స్పాట్‌ను చెక్ చేయండి: పుచ్చకాయ మధ్య భాగంలో కాండం ఉంటుంది. ఇది భూమికి కాయకి మధ్య కనెక్షన్. దానిని ఫీల్డ్ స్పాట్ గా చెబుతారు. దానిని తనిఖీ చేయాలి. అది పసుపు లేదా లేత నారింజ రంగులో ఉంటే అది పండిన పుచ్చకాయగా గుర్తించాలి. ఆ ఫీల్డ్ స్పాట్ తెల్లగా లేదా ఆకుపచ్చగా ఉంటే అది పండనిదిగా పరిగణించాలి.

5 / 9
కాయపై కొట్టండ : పుచ్చకాయ కొనే ముందు మీ వేళ్లతో కాస్త కొట్టండి. పండిన పుచ్చకాయ బోలు ధ్వనిని కలిగి ఉంటుంది. పండనిది మందమైన ధ్వనిని కలిగి ఉంటుంది.

6 / 9
పుచ్చకాయ చర్మం: పండిన పుచ్చకాయ నిస్తేజంగా ఉంటుంది. దానిపై చర్మం మెరిసితూ ఉంటే అది ఇంకా పక్వానికి రాలేదని అర్థం చేసుకోవాలి. అలాగే, చర్మం దృఢంగా ఉండాలి. దానిపై మచ్చలు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి.

7 / 9
షుగర్ స్పాట్స్ కోసం చూడండి: పుచ్చకాయ పై తొక్కపై చిన్న, కఠినమైన పాచెస్‌ను షుగర్ స్పాట్స్‌గా సూచిస్తారు. ఈ మచ్చలు ఉంటే అది పండి, తినడానికి సిద్దంగా ఉందని గ్రహించాలి.

8 / 9
బరువు: పుచ్చకాయ పండితే అది ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. ఎందుకంటే పండులో నీరు నిండి ఉంటుంది. దాని వల్ల బరువు పెరుగుతుంది.

9 / 9
వాసన చూడాలి: చివరిగా పుచ్చకాయ కొనేముందు మీరు దాని వాసనను చూడాలి. పండిన పుచ్చకాయ ఒకరకమైన తీపి వాసనను కలిగి ఉంటుంది. ఎటువంటి వాసన లేదంటే అది ఇంకా పండలేదని అర్థం చేసుకోవాలి.