అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే

Updated on: Sep 09, 2026 | 8:51 PM

వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే పుచ్చకాయను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, పుచ్చకాయను తినేటప్పుడు అందులోని గింజలను తీసి పక్కన పడేయడం మనందరికీ అలవాటు. కానీ, ఈ చిన్న గింజల్లో ఊహించని స్థాయిలో పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూపర్‌ఫుడ్‌గా నిలిచే పుచ్చకాయ గింజల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పోషకాల గని: పుచ్చకాయ గింజల్లో కెలోరీలు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫోలేట్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

2 / 5
గుండె ఆరోగ్యానికి కొండంత అండ: ఈ గింజల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలోని మెగ్నీషియం రక్తపోటును సమతుల్యంగా ఉంచి, హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తుంది.

3 / 5
చర్మం, జుట్టు సంరక్షణ: పుచ్చకాయ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని తడి లేకుండా ఉంచి, ముడతలు పడకుండా కాపాడతాయి. ముఖంపై మొటిమలను నివారించడంలో జింక్ సహాయపడుతుంది. అలాగే, వీటిలోని ప్రోటీన్లు, మెగ్నీషియం జుట్టు ఊడటాన్ని తగ్గించి, వెంట్రుకలు బలంగా పెరిగేలా చేస్తాయి.

4 / 5
బ్లడ్ షుగర్, జీర్ణక్రియ నియంత్రణ: మధుమేహంతో బాధపడేవారికి పుచ్చకాయ గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

5 / 5
వీటిని ఎలా తీసుకోవాలి?: పుచ్చకాయ గింజలను నేరుగా తినడం కంటే, వాటిని సేకరించి బాగా ఎండబెట్టి, కాస్త ఉప్పు లేదా మసాలా చల్లి బాణలిలో దోరగా వేయించి తీసుకోవచ్చు. వీటిని సలాడ్లు, స్మూతీలు లేదా ఈవెనింగ్ స్నాక్స్‌లో భాగం చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us