
కావాల్సిన పదార్థాలు : గోంగూర రెండు కట్టలు, ఆయిల్ మూడు టేబుల్ స్పూ్న్స్, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు 3, ఎండు మిర్చి 6, ధనియాలపొడి 2 టేబుల్ స్పూన్స్, చింత పండు కొచెం, వీలైతే ఒక టమాటా, పోపు కోసం, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వన్ టీస్పూన్, కారం, ఉప్పు రుచికి సరిపడ.

తయారీ విధానం : ముందుగా గోంగూర ఆకులు తుంచి శుభ్రంగా కడిగి, నీరు ఇంకిపోయే వరకు పక్కన ఒక కాటన్ క్లాత్‌లో పెట్టాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి అందులో అందులో ధనియాలు, మెంతులు, ఆవాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే నూనె వేసి, మనం ముందుగా తుంచి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేయించుకోవాలి.

గోంగూర స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. ఇలా చేయండం వలన అది మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది. గోంగూర కలర్ ఛేంజ్ అయిన తర్వాత చింత పండు, టమాట ముక్కలు వేసి, కలపాలి, 5 నిమిషాల తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. గోంగూర చల్లారే వరకు చూడాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోని అందులో వేయించుకున్న ధనియాలు, మెంతి, ఆవాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్‌ను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

తర్వాత మిక్సీ జార్‌లో వేయించిన గోంగూర వేసి, అందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క , కారం, రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి వేసి చాలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి.

తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి, అందులో వన్ టేబుల్ స్పూన్ నూనే వేసి, ఎండు మిర్చీ, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, శనగ పప్పు, కరివేపాకు రెబ్బలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి మిశ్రమం వేయాలి. దీనిని పోపు మొత్తం పట్టేలా మంచిగా కలిపి, ఐదు నిమిషాల తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లో నింపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ.