
ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే కొన్ని విషయాలను రోజు వారీ జీవితంలో పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇందులో పాలు చాలా ముఖ్యమైనవి. పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని సంగతి అందరికీ తెలుసు. రోజువారీ ఆహారంలో పాలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

అయిలే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. వీళ్లు పాలతోపాటు పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులను నివారించాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గడానికి బదులుగా మరింతగా పెరుగుతాయి.

స్కిమ్డ్ మిల్క్, వెన్న, ఫుల్ ఫ్యాట్ చీజ్ తినడం మానుకోవాలి. ఎందుకంటే క్రీమ్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

స్కిమ్డ్ మిల్క్, తక్కువ కొవ్వు పెరుగు, జున్ను తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి కాల్షియం, ప్రోటీన్లు అందుతాయి. కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా నిరోధించవచ్చు. నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి. అయితే ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తే గుండె సమస్యల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.