
బంగారం శతాబ్ధాలుగా, ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ హెచ్చు తగ్గులలో కీలక పాత్ర పోషిస్తుంది. విలువైన ఈ లోహంతో చాలా దేశాలు సంపన్నదేశాలుగా వెలుగొందుతున్నాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు భూమిపై ఏ దేశాలు ఎక్కువ బంగారం కలిగి ఉన్నాయో? అమెరికా ఫోర్ట్ నాగ్స్ నుంచి ఆఫ్రికా, ఆస్ట్రేలియా పురాతన బంగారు క్షేత్రాల వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నిల్వల నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఆ స్ట్రేలియా : ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిక్షేపాలు ఉన్న దేశంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. అత్యంత సంపన్నమైన బంగారం పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉంది. భూగర్భ సర్వేల ప్రకారం, అ్కడ12000 టన్నులకు పైగా తవ్వబడని బంగారు నిల్వల నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.

రష్యా : బంగారు నిక్షేపాలు అత్యధికంగా ఉన్న దేశంలో రష్యా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 11,100 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.

యునైటెడ్ స్టేట్స్ : యునైటెడ్ స్టేట్స్ బంగారు నిల్వల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది సెంట్రల్ బ్యాంక్‌లో అధిక మొత్తంలో బంగారం నిల్వ చేయడమే కాకుండా, అత్యధిక భూగర్భ బంగారు నిక్షేపాలను కలిగి ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్, సుమారు8,133 టన్నుల బంగారు నిక్షేపాలు కలిగి ఉన్నట్లు సమాచారం.

అదేవిధంగా , అత్యధిక బంగారు నిక్షేపాలు కలిగిన దేశంలో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 5000 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చైనా 3000 టన్నుల బంగారు నిల్వ, నిక్షేపాలతో ఐదవ స్థానంలో నిలిచింది.