Refrigerate Fruits: ఈ పండ్లను మర్చిపోయి కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.. ఎందుకో తెలుసా?

|

Oct 20, 2023 | 8:56 PM

పుచ్చకాయ, మామిడి వంటి పండ్లను కూడా చల్లగా తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో ఉంచి తింటుంటారు. అయితే వీటిని ఫ్రిజ్‌లో ఉంచి తినడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది మామిడిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను తగ్గిపోతాయట. అందుకే వీటిని ఫ్రిజ్‌లో ఉంచకూదదంటున్నారు. లిచీ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్ నుంచి తెచ్చిన రోజునే వీటిని..

1 / 5
పుచ్చకాయ, మామిడి వంటి పండ్లను కూడా చల్లగా తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో ఉంచి తింటుంటారు. అయితే వీటిని ఫ్రిజ్‌లో ఉంచి తినడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది మామిడిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను తగ్గిపోతాయట. అందుకే వీటిని ఫ్రిజ్‌లో ఉంచకూదదంటున్నారు.

2 / 5
లిచీ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్ నుంచి తెచ్చిన రోజునే వీటిని తినడం బెటర్‌. లిచీని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది పాడైపోతుంది. దానిలోని పోషకాలు నశిస్తాయి.

3 / 5
చాలా మంది పుచ్చకాయను చల్లగా తినడానికి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచి.. చల్లగా అయిన తర్వాత తింటే పుచ్చకాయలోని పోషకాలు నశిస్తాయని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయను ఫ్రిజ్‌లో అలాగే ఉంచితే పర్లేదు. అదే సగం కట్‌ చేసి ఉంచితే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు నశిస్తాయని అంటున్నారు.

4 / 5
యాపిల్ పోషకాలు అధికంగా ఉండే పండు. అందుకే డాక్టర్లందరూ ప్రతి రోజూ యాపిల్స్ తినమని సిఫార్సు చేస్తుంటారు. రోజుకో యాపిల్ తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందడని సూచిస్తుంటారు. అయితే యాపిల్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని పోషకాలు పోతాయంటున్నారు. ఒకవేళ తప్పనిసరిగా యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచవల్సి వస్తే.. వాటిని కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.

5 / 5
పొరపాటున కూడా అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచవద్దంటున్నారు నిపుణులు. అరటిపండ్లు ఆరుబయట ఉంచినప్పుడు బాగా పండుతాయి. ఈ పండులోని ఇథిలీన్ వాయువు విడుదల కావడం వల్ల అరటిపండు త్వరగా పండుతుంది. అదే అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే అవి నల్లగా మారి త్వరగా పాడవుతాయి. అరటిపండ్లను గది ఉష్ణోగ్రతలో ఉంచితే వీటిలోని పోషకాలు  పాడవకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.