
ఆల్కహాల్ ప్రియులు వివిధ రకాల ఆల్కహాల్ బ్రాండ్‌లను తాగేందుకు ఇష్టపడతారు. ఇందులో కొన్ని ఆల్కహాల్‌లు చాలా ఖరీదైనవి. కొన్ని ఆల్కహాల్‌లు రుచిగా కూడా ఉంటాయి. అయితే వీటిల్లో ఆల్కహాల్ శాతం ఒక్కోదానిలో ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా బీరులో దాదాపు 4 నుండి 8 శాతం ఆల్కహాల్ ఉంటుంది. మిగిలిన రకాల ఆల్కహాల్‌లలో 40 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది.

మన దేశంలో 50 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం ఊహించడం కష్టం. ఎందుకంటే 50 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం త్వరగా మత్తును కలిగిస్తుంది. కానీ ప్రపంచంలో ఇలాంటి కొన్ని మద్యం బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో చాలా ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది.

ఈ కలయిక వలన మత్తు త్వరగా పెరిగి, వ్యక్తి నియంత్రణ కోల్పోయి సాధారణం కంటే ఎక్కువగా మద్యం తాగుతాడు. ఫలితంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫీన్ గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవచ్చు.

ముఖ్యంగా ఎవర్‌క్లియర్ 190 మద్యం బ్రాండ్. ఇది అమెరికన్ మద్యం. ఇందులో 95 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఈ మద్యం చాలా ప్రమాదకరమైనది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీనిని నిషేధించారు. ఈ మద్యం బాటిల్‌ను నిప్పుకి దూరంగా ఉంచాలి. లేదంటే అవి పేలిపోయి అగ్నిప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది.

బ్రూచ్‌లాడిచ్ X4 క్వాడ్రపుల్డ్ అనే విస్కీలో మొత్తం ఆల్కహాల్ శాతం 92 శాతం ఉంటుంది. ఈ విస్కీని తయారు చేసేటప్పుడు దీనిని నాలుగు సార్లు స్వేదనం చేస్తారు. ఇది స్టాంగ్ సింగిల్ మాల్ట్ విస్కీ. దీనిని అధిక ఆల్కహాల్ పానీయాలు, జ్యూస్‌లు, నీరు మొదలైన వాటితో తాగాలని చెబుతారు.