
అడవికి రాజు సింహం.. సింహాన్ని దూరం నుంచి చూస్తే చాలు.. ఏ జంతువైనా కూడా తన ప్రాణాలను రక్షించుకునేందుకు కచ్చితంగా పక్కకు జరుగుతాయి. ఇక దాని గర్జన.. అన్ని జంతువులలోనూ భయాన్ని పుట్టిస్తుంది.

సింహ గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో.. అంతే భారీగా కూడా వినిపిస్తుంది. మరి ఎంత దూరం వినిపిస్తుంది ఈ గర్జన అని మీరెప్పుడైనా ఆలోచించారా.!

నిజానికి, ఒక సింహం గర్జిస్తే.. ఆ శబ్దం సుమారు ఐదు మైళ్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ సామర్ధ్యం కేవలం సింహం బలాన్ని సూచించడమే కాదు.. సింహాలు తమ భూభాగాన్ని గుర్తించడానికి వాడతాయి.

అంతేకాదు ఇతర సింహాలతో కమ్యూనికేట్ చేయడానికి, తమను లేదా తమ సమూహాన్ని బెదిరించడానికి ప్రయత్నించే ఇతర జంతువులను హెచ్చరించడానికి ఈ గర్జనను ఉపయోగిస్తాయి.

ఐదు మైళ్ల దూరం వరకు వినపడే ఈ ప్రతిధ్వని, సింహాలు తమ రాజ్యంపై పూర్తి ఆధిపత్యాన్ని ఎలా నిలుపుకుంటాయో స్పష్టం చేస్తుంది. సింహగర్జన అంటే కేవలం అరుపు మాత్రమే కాదు.. అటవీ ప్రపంచంలో తనకున్న స్థానాన్ని, శక్తిని ప్రకటించే ఓ బ్రాండ్ అని చెప్పొచ్చు.