10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్.. పరిశోధనల్లో తేలిన అవాక్కయ్యే నిజాలు..

Updated on: Aug 19, 2026 | 5:00 PM

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కచ్చితంగా 10,000 అడుగులు నడవాలని స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ యాప్‌లలో తరచూ చూస్తుంటాం. అయితే ఈ 10,000 అడుగుల లెక్క ఏ వైద్య పరిశోధనల ద్వారానో తేలింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్ తర్వాత 1965లో జపాన్‌కు చెందిన యమాసా అనే సంస్థ మన్పో కే పేరుతో ఒక పెడోమీటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జపనీస్ భాషలో 10,000 అంకె గుర్తు నడుస్తున్న మనిషిలా ఉండటంతో, వ్యాపార ప్రచారం కోసం తెచ్చిన ఆ నినాదమే కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక ఫిట్‌నెస్ లక్ష్యంగా మారిపోయింది.

1 / 5
ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు పలు ప్రముఖ వైద్య సంస్థల అధ్యయనాల ప్రకారం.. సంపూర్ణ ఆరోగ్యానికి రోజుకు 10,000 అడుగులు నడవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ 7,000 నుండి 8,000 అడుగులు నడిచినా శరీరానికి కావాల్సిన పూర్తి ప్రయోజనాలు అందుతాయి. 7,500 అడుగులు దాటిన తర్వాత ఎంత ఎక్కువ నడిచినా శరీరానికి లభించే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

2 / 5
నడకలో అడుగుల సంఖ్య కంటే నడిచే వేగం, క్రమశిక్షణే అత్యంత ముఖ్యం. రోజంతా కూర్చుని సాయంత్రం ఒకేసారి నెమ్మదిగా 10,000 అడుగులు వేయడం కంటే రోజుకు 6,000 అడుగులు చురుగ్గా నడవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రోజుకు కనీసం 4,000 అడుగులు వేగంగా నడిచినా అకాల మరణ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా గంటల తరబడి కూర్చోకుండా ప్రతి గంటకు రెండు నిమిషాలు నడిస్తే శరీర జీవక్రియ చురుగ్గా ఉంటుంది.

3 / 5
నడక వేగం విషయానికి వస్తే, నిమిషానికి 100 నుండి 120 అడుగులు లేదా గంటకు 4 నుండి 5 కిలోమీటర్ల వేగంతో నడవడం ఉత్తమం. నడుస్తున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరిగి కొద్దిగా ఆయాసం రావాలి, కానీ మాట్లాడలేనంతగా ఉండకూడదు. మొదటి 3 నిమిషాలు నెమ్మదిగా నడవడం ప్రారంభించి, ఆ తర్వాత వేగం పెంచి, చివరగా ముగించే 3 నిమిషాల్లో వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. వృద్ధులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు వారి శరీర సామర్థ్యాన్ని బట్టి వేగాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.

4 / 5
క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ నడవడం వల్ల గుండె కండరాలు బలపడతాయి, రక్తపోటు అదుపులోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్, అదనపు క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. అలాగే ఇన్సులిన్ పనితీరు మెరుగై రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికే కాకుండా మెదడుకు రక్తప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి రాత్రివేళల్లో గాఢమైన నిద్ర పడుతుంది.

5 / 5
కాబట్టి 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. డిజిటల్ తెరపై కనిపించే అంకెల వెనుక పరుగులు తీయకుండా, మన వయస్సు, శరీర తత్వానికి తగినట్లుగా రోజుకు 6,000 నుంచి 8,000 అడుగులను లక్ష్యంగా పెట్టుకుని చురుగ్గా నడవడమే సంపూర్ణ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.

Loading...
Unable to load recommendations.
Follow Us