
మక్కగారెలు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఉల్లి పాయ రెబ్బలు పొట్టు తీసినవి కప్పు, పచ్చి మిర్చీ నాలుగు నుంచి ఐదు, కారం వేసుకోకూడదు అనుకుంటే వీటిని మీరు తినే కారానికి సరిపడ తీసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, చిటికెడు పసుపు, మక్కజొన్నలు నాలుగు కప్పులు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా మొక్కజొన్న కంకులను తీసుకొని వాటి నుంచి గింజలను వేరుచేయాలి. తర్వాత ఆ గింజలను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పచ్చి మిర్చీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు.

దీని తర్వాత పిండిని మరొక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, వీలైతే ధనియాల పొడి కొంచెం, చిటికెడు పసుపు వంటివి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే గారెలు రుచిగా ఉంటాయి.

తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ , కవర్ లేదా ఏదైనా క్లాత్ పై గారెల ఆకారంలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి. తర్వాత అందులో మక్కజొన్న గారెలు వేసి మంచిగా రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది.

తర్వాత వాటిన మరొక బౌల్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ మక్కజొన్న గారెలు రెడీ. వీటిని నాన్ వెజ్ వంటకాలు లేదా ఇతర ఏ చట్నీలతో తిన్నా అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అద్భుతమైన రిసిపీనీ తయారు చేసుకోండి.