లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్ -35 లైటెనింగ్ II : యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం 2015 లో ఈ ఫైటర్ జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎఫ్-35 లో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి. వాటి ల్యాండింగ్ సామర్థ్యాలలో తేడాలు ఉన్నాయి
చెంగ్డు జె -20 : ఇది చైనా దేశానికి చెందిన ఫైటర్ జెట్. చెంగ్డు ఏరోస్పేస్ కార్పొరేషన్ 2017 లో జె -20 ను ప్రవేశపెట్టింది. దీనిని 2011 లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
సుఖోయ్ ఎస్‌యు -57 : రష్యాకు చెందిన సుఖోయ్ కంపెనీ ఈ సుఖోయ్ ఎస్‌యు-57 ఫైటర్ జెట్‌ను తయారు చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీని సొంతం. ఐదవ తరం యుద్ధ విమానాల్లో దీనికి ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. రష్యన్ వైమానిక దళంలో దీనిని 2020లో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టారు.
లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్ -22 రాప్టర్ : ఎఫ్ -22 రాప్టర్ మొదటి ఐదవ తరం ఫైటర్ జెట్. ఇది ఉనికిలో ఉన్న రహస్య ఫైటర్ జెట్‌గా పేరు గడించింది. దీనిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించారు. అధిక వ్యయం కారణంగా దీని ఉత్పత్తిని 2011లో నిలిపివేశారు. భయంకరమైన యుద్ధ విమానాల్లో ఇది ఒకటి.
షెన్యాంగ్ ఎఫ్‌సి -31 : ఇది 5వ తరం ఫైటర్ జెట్. దీనిని త్వరలోనే మిలిటరీలో ప్రవేశపెట్టబోతున్నారు.
Dassault Rafale
యూరోఫైటర్ టైఫూన్ : ఈ ఫైటర్ జెట్‌ను బ్రిటన్, జర్మనీ, ఖతార్, కువైట్, ఇటలీ, ఇతర దేశాలు ఉపయోగిస్తున్న 4వ తరానికి చెందిన మల్టీరోల్ ఫైటర్ జెట్.
బోయింగ్ ఎఫ్ -15 ఎక్స్ : మెక్‌డొన్నెల్ డగ్లస్ ఎఫ్ -15 ఈగిల్ బోయింగ్ విమానాన్ని యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం (యుఎస్‌ఎఎఫ్) సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల వైమానిక దళాలు వినియోగిస్తున్నాయి. ఈ బోయింగ్ విమానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలది. ఎఫ్-15ఈఎక్స్ కొత్త నియంత్రణ వ్యవస్థ ఉంది. 4వ తరానికి చెందిన ఈ ఫైటర్ జెట్ అంత్యం సమర్థమైనది.
సుఖోయ్ ఎస్‌యు -30 ఎస్ఎమ్ : ఇది రష్యన్ వైమానిక దళంలో ఉంది. ఎస్‌యు 27ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది అనేక కీలక రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది. భారత్, వియత్నాం, అర్మేనియా సహా చాలా దేశాలు ఈ ఫైటర్ జెట్‌ను వినియోగిస్తున్నాయి.
జెఎఫ్ -17 థండర్ / హెచ్ఏఎల్ తేజస్: ఈ రెండు మోస్ట్ పవర్ ఫుల్ ఫైటర్స్ జెట్స్ అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చలేమని అంటున్నారు. వేగంగా ప్రయాణిస్తాయి. జేఎఫ్ -17, తేజస్ 4 వ తరం లైట్ ఫైటర్ డిజైన్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఆయుధ సంపత్తిని సునాయాసంగా మోసుకెళ్తాయి.