
చింతచిగురు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువ వేసవిలో దొరుకుతుంది. ఇది తెలియని వారంటూ ఉండరు. కానీ కొందరికి దీనిని ఎలా తినాలో తెలియదు. ఇది తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా తెలియదు. అన్ని చెట్ల మాదిరే, ఈ చింత చెట్ల ఆకులు కూడా ఎప్పటికప్పుడు రాలి పోతాయి. ఆ తర్వాత లేత చిగురులు వస్తాయి.

ఈ చింతచిగురు ఫిబ్రవరి,మార్చి ,ఏప్రిల్,మే నెలల్లో బాగా దొరుకుతుంది. అయితే, మీరు దీనిని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని తినొచ్చు. ఇంకా ఈ చిగురులను పచ్చడి, పప్పు, కూరల్లో కూడా వేసుకోవాలి. చింత చిగురు తోనే ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటారు. అయితే, ఇది రుచికి పుల్లగా వుంటుంది. కానీ, కూరల్లో చింత పండును వేయరు.

చింత చిగురులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో మీ బాడిలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గించి ఇంకా మంచి కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతుంది. ఇంకా యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఉంటాయి

చింత చిగురులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఈ ఆకులు కిడ్నీలో రాళ్ళను పిండిని చేస్తాయి. అలాంటి పవర్ఫుల్ ఆకు మరి. ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంకా చింతచిగురులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తాయి.

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)