కూరగాయలు లేనప్పుడు చేసుకునే టేస్టీ రిసిపీ.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్!

Updated on: Nov 11, 2026 | 8:22 AM

ఉదయాన్నే వంట చేయడం చాలా కష్టం. ఆఫీసుకు వెళ్లే వారు ఉదయాన్నే కూరగాయలు కట్ చేసి వండే అంత టైం ఉండదు. అయితే ఎలాంటి కూరగాయలు లేకపోయినప్పటికీ, అప్పటికప్పుడు ఈ టేస్టీ రైస్ ప్రిపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అంతే కాకుండా పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా ఇది చాలా బెస్ట్. ఇంతకీ అది ఏ రైస్ అంటే?

1 / 6
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా త్వరగా రుచికరమైన లంచ్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు తాలింపు అన్నం అద్భుతమైన ఎంపిక. మిగిలిన అన్నంతో కేవలం కొన్ని నిమిషాల్లో దీన్ని చేసుకోవచ్చు. వెల్లుల్లి, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వంటి సాధారణ పదార్థాలతో చేసే ఈ వంటకం మంచి ఆకలిని పుట్టిస్తుంది. కాగా దీని తయారీ గురించి తెలుసుకుందాం.

2 / 6
తాలింపు అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఉడికించిన అన్నం: 2 కప్పులు,  ఉల్లిపాయలు: 1 , పచ్చిమిర్చి: 2 , వెల్లుల్లి: 10-15 రెబ్బలు ,   ఎండుమిర్చి: 1,  పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు,  ఆవాలు: అర టీ స్పూన్,   జీలకర్ర: అర టీ స్పూన్, కరివేపాకు,  నూనె: 2 టేబుల్ స్పూన్లు, పసుపు: పావు టీ స్పూన్,   కారం: 1 టీ స్పూన్ ,  ధనియాల పొడి: 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా,   కొత్తిమీర, నిమ్మరసం.

3 / 6
తయారీలోకి వెళ్లితే..  ముందుగా, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పదిహేను వెల్లుల్లి రెబ్బలను తీసుకుని, వాటిని లైట్‌గా దంచి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ముద్దగా కాకుండా పొడిపొడిగా విప్పి సిద్ధంగా ఉంచాలి.

4 / 6
ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిని వేడి చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక, రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తరువాత, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి బాగా వేయించాలి. తాలింపు అన్నంలో వెల్లుల్లి ఫ్లేవర్ మంచి రుచిని ఇస్తుంది. వెల్లుల్లి రంగు మారడం మొదలుపెట్టగానే, ఒక ఎండుమిర్చిని తుంచి వేయాలి. ఆ వెంటనే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొద్దిగా వేయించాలి.

5 / 6
 పచ్చిమిర్చి కాస్త వేగాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలను మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. అవి కాస్త దోరగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది పచ్చిమిర్చికి ఉప్పు పట్టి, తినేటప్పుడు రుచిని పెంచుతుంది.

6 / 6
ఇప్పుడు పొడిపొడిగా విప్పి పెట్టుకున్న ఉడికించిన అన్నాన్ని కడాయిలోకి తీసుకోవాలి. అన్నం వేసిన తరువాత, రుచికి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ కారం , ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అన్ని పదార్థాలను బాగా కలిసేలా గరిటతో కలపాలి.  తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇష్టమైతే నిమ్మరసం కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ తాలింపు రైస్ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us