
డార్క్ చాక్లెట్: చాక్లెట్ అంటేనే పళ్లు పాడవుతాయనే భయం. కానీ 70 శాతం కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను గట్టిపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, ఇందులో ఉండే మెగ్నీషియం దంతాల తిరిగి రీమినరలైజేషన్‌కు చాలా కీలకం.

పచ్చి జున్ను: జున్ను తినడం వల్ల పళ్లు పాడవుతాయని చాలామంది భయపడతారు. కానీ ముడి చీజ్ మీ నోటిలో pH స్థాయిలను పెంచుతుంది. ఇది దంత క్షయం కలిగించే ఆమ్లాలతో పోరాడుతుంది. ఇందులో ఉండే కాసిన్ ఎనామెల్‌ను మరమ్మతు చేస్తుంది.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలోని ఆమ్లం ఎనామిల్‌ను బలహీనపరుస్తుందనేది నిజమే.. కానీ చిగుళ్ల ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లను ఆస్వాదించండి, కానీ తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. చిగుళ్లలో రక్తస్రావం విటమిన్ సి లోపం వల్ల వస్తుంది, కేవలం ఫ్లాసింగ్ చేయకపోవడం వల్ల కాదు.

ఊరగాయలు: ఊరగాయల్లోని వెనిగర్ చూసి భయపడాల్సిన పనిలేదు. సాంప్రదాయ ఊరగాయలలో ఉండే పులియబెట్టిన స్వభావం నోటిలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తుంది. ఇది కావిటీస్, చిగుళ్ల వ్యాధుల నుండి రక్షిస్తుంది.

గింజలు: గింజలు తినడం వల్ల పళ్లు పగులుతాయని భయపడతారు. కానీ గింజలను గట్టిగా నమలడం వల్ల దవడ ఎముక సాంద్రత పెరుగుతుంది. అంతేకాకుండా గింజల్లో మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎనామిల్ ఆరోగ్యానికి చాలా అవసరం. డాక్టర్ బర్హెన్ సూచనల ప్రకారం.. ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం వల్ల దంతాలు పాడవకపోగా, మరింత ఆరోగ్యంగా మరియు బలంగా తయారవుతాయి.