
కావాల్సిన పదార్థాలు : అరకిలో మటన్, శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 2 , పావు టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, టమోటాలు 2, పచ్చిమిరపకాయలు 4, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఎర్ర కారం పొడి రుచికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 టీస్పూన్, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు, కొత్తిమీర , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా శనగపప్పును తీసుకుని వాటిని ముందుగానే నీటిలో నానబెట్టుకోవాలి. ఇంకా ఈ మటన్ ముక్కలకు కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 20 నిమిషాల పాటు దీనిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ను పొయ్యి మీద పెట్టుకోండి.

తయారీ విధానం స్టెప్ 2 : కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు పారదర్శకంగా, మెత్తగా అయ్యే వరకు వేయించండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలి. దీనిలో కట్ చేసుకున్న తరిగిన టమోటాలను దీనిలో వేసి, మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి

తయారీ విధానం స్టెప్ 3 : ఇప్పుడు దీనిలో ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలను వేసి వేసి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంకా కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి గరం మసాలా కూడా దీనిలో వేసి కలుపుకోవాలి.

తయారీ విధానం స్టెప్ 4 : ఇప్పుడు ముందుగా నానబెట్టిన సెనగపప్పును కూడా దీనిలో వేసి, ఇంకా దీనిలో తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఆ తరవాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, 3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచాలి. మటన్ మెత్తగా అయ్యే వరకు దీనిని ఉడికించుకోవాలి.