మొలకెత్తిన మెంతులు రోజూ తింటే ఇన్ని లాభాలా..? శరీరంలో జరిగేది ఇదే..!

|

Jul 20, 2024 | 8:15 PM

మెంతుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. మెంతులు రుచిలో కాస్త చేదుగా ఉంటాయి. మధుమేహం బాధితులు మెంతులు తినటం వల్ల బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందని ఆరోగ్యనిపుణులు, వైద్యులు తరచూ చెబుతుంటారు. కేవలం మెంతులు మాత్రమే కాదు..మొలకెత్తిన మెంతిగింజలు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా..? మెంతలును మొలకెత్తించి తింటే ఎంతో మంచిదని చెబుతున్నారు. ఈ మొలకెత్తిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తింటే మధుమేహంతో పాటు అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మొలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు అందుతాయి. మధుమేహంతో పాటు నాలుగు వ్యాధులకు మెంతికూర ఔషధంగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రమే మెంతికూర తినాలని చాలా మంది అనుకుంటారు. ప్రతిరోజూ పావు స్పూను మొలకెత్తిన గింజలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తగ్గుతుంది.

2 / 5
మొలకెత్తిన మెంతులు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని రోజూ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మెంతి మొలకలు తినటం వల్ల రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది. మొలకెత్తిన మెంతులు తినడం వల్ల PMS లక్షణాలు తగ్గుతాయి. ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది..

3 / 5
మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మొలకెత్తిన మెంతులు సోడియం స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..అధిక కొలెస్ట్రాల్, బీపీ, మలబద్ధకం వంటి అనేక రుగ్మతలతో బాధపడుతున్నవారికి కూడా మొలకెత్తిన మెంతులు ఔషధంగా పనిచేస్తాయి.

4 / 5
మెనోపాజ్ వచ్చిన మహిళలు మెంతులను కచ్చితంగా తినాలి. మొలకెత్తిన గింజల రూపంలో మెంతులను తినడం సులభం. వీటి ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల హార్మోన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. నెలసరి తిమ్మిరితో బాధపడే అమ్మాయిలు మొలకెత్తిన మెంతులను డైట్ లో చేర్చుకోవాలి. ఇది నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. పెయిన్ కిల్లర్స్ తినాల్సిన అవసరం కూడా ఉండదు.

5 / 5
మొలకెత్తే ప్రక్రియ మెంతిలోని పోషక విలువలను పెంచుతుంది. వీటిలోని పోషకాలు మీ కండరాలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన మెంతులలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మెలకెత్తిన మెంతులలోని గెలాక్టోమన్నన్‌.. మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి, ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా రక్షిస్తాయి, ఫ్రీ రాడికల్స్‌తోనూ పోరాడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.