IND vs ENG: ఈ టీమిండియా బౌలర్‌కు బహుషా ఇదే లాస్ట్‌ టెస్ట్‌ అవుతుందేమో..? ఎందుకంటే..

Updated on: Jul 04, 2025 | 9:46 PM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ప్రసీద్ కృష్ణ చెత్త రికార్డు నెలకొల్పాడు. 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అత్యంత చెత్త ఎకానమీ రేటుతో ప్రసీద్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విజేత అయినా, ఇంగ్లాండ్ పర్యటనలో అతని ప్రదర్శన నిరాశపరిచింది.

1 / 5
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో తొలి ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇప్పుడు వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూసేలా పరిస్థితి మారిపోతున్నట్లు కనిపిస్తోంది. 84 వికెట్లకు ఇంగ్లాండ్ టాప్ 5 వికెట్లు తీసిన టీం ఇండియా పేసర్లు ఆ తర్వాత వికెట్ల కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

2 / 5
ముఖ్యంగా 2025 ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్న ప్రసీద్ కృష్ణకు ఇంగ్లాండ్ పర్యటన ఒక పీడకలగా మారుతోంది. ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న కృష్ణ, ఇంగ్లాండ్ పర్యటనలో సులభంగా పరుగులు ఇవ్వడంతో అతని పేరిట ఒక చెత్త రికార్డు వచ్చి చేరింది.

3 / 5
ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన ప్రసీద్ కృష్ణ ఇప్పుడు 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ప్రసీద్ కృష్ణ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చెత్త ఎకానమీ రేట్ ఉన్న బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో కనీసం 500 బంతులు వేసి అత్యధిగ ఎకానమీ ఉన్న బౌలర్‌గా ప్రసీద్ బ్యాడ్‌ రికార్డు మూటగట్టుకున్నాడు.

4 / 5
టెస్ట్ క్రికెట్‌లో ఓవర్‌కు 5 పరుగులకు పైగా ఎకానమీతో కృష్ణ ప్రపంచంలోని చెత్త బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అదనంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి బౌలింగ్‌తో బహుషా.. ప్రసిద్‌కు మూడో టెస్టులో చోటు కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

5 / 5
మొత్తంగా టెస్ట్ రికార్డు పరంగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షహదత్ హుస్సేన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. 5380 బంతుల్లో 4.16 ఎకానమీ రేటుతో 3731 పరుగులు ఇచ్చాడు. టీం ఇండియా తరఫున ఎడమచేతి వాటం పేసర్ ఆర్పీ సింగ్ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త ఎకానమీ రేటు రికార్డును కలిగి ఉన్నాడు. 2534 బంతుల్లో 3.98 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.