Vinesh Phogat: జుట్టు, గోర్లే కాదు.. రక్తం కూడా ధార పోసిన వినేష్.. బరువు తగ్గేందుకు ఇంకేం చేసిందంటే?

|

Aug 07, 2024 | 2:15 PM

Paris Olympics 2024: సమాచారం ప్రకారం, వినేష్ ఫోగట్ మంగళవారం రాత్రి తనిఖీ చేసినప్పుడు ఆమె బరువు 2 కిలోలు పెరిగింది. అందుకే వినేష్ రాత్రంతా నిద్రపోకుండా ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. నివేదికల ప్రకారం, సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినప్పుడు వినేష్ 52 కిలోల బరువుతో ఉంది. ఇక వినేష్ రాత్రంతా కష్టపడి 2 కేజీల బరువు తగ్గించుకుంది.

1 / 6
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌కు దూరమైంది. 50 కిలోల రెజ్లింగ్ ఈవెంట్‌లో మంగళవారం రాత్రి జరిగిన సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన గుజ్‌మన్ లోపెజ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన వినేష్ ఫోగట్, నిర్దేశిత బరువు పరిమితి కంటే ఎక్కువగా ఉన్నందుకు పోటీ నుంచి తప్పించారు.

2 / 6
సమాచారం ప్రకారం, వినేష్ ఫోగట్ మంగళవారం రాత్రి తనిఖీ చేసినప్పుడు ఆమె బరువు 2 కిలోలు పెరిగింది. అందుకే వినేష్ రాత్రంతా నిద్రపోకుండా ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. నివేదికల ప్రకారం, సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినప్పుడు వినేష్ 52 కిలోల బరువుతో ఉంది. ఇక వినేష్ రాత్రంతా కష్టపడి 2 కేజీల బరువు తగ్గించుకుంది.

3 / 6
మీడియా నివేదికల ప్రకారం, సెమీ-ఫైనల్ గెలిచిన తర్వాత వినేష్ ఫోగట్ విశ్రాంతి తీసుకోలేదు. ఆమె తన అదనపు బరువును తగ్గించుకోవడానికి రాత్రంతా మేల్కొని ఉంది. స్పోర్ట్స్ స్టార్ నివేదిక ప్రకారం, వినేష్ ఫోగట్ బరువు తగ్గడానికి సైక్లింగ్, స్కిప్పింగ్‌ను ఆశ్రయించింది.

4 / 6
అంతేకాదు, బరువు తగ్గేందుకు వినేష్ తన జుట్టు, గోళ్లను కూడా కత్తిరించుకుంది. అలాగే, శరీరంలోని రక్తాన్ని కూడా బయటకు తీసింది. ఈ కారణంగా కేవలం 1 రాత్రిలో ఆమె 1 కిలో 850 గ్రాముల బరువు తగ్గింది. కానీ, ఆమె నిర్దేశించిన బరువు కంటే 150 గ్రాములు మాత్రమే ఎక్కువగా ఉంది. దీంతో అనర్హత వేటు పడింది.

5 / 6
రెజ్లింగ్‌లో, ఏదైనా రెజ్లర్‌కు 100 గ్రాముల అదనపు బరువు మాత్రమే ఇచ్చారు. అంటే, వినేష్ 50 కేజీలు, 100 గ్రాముల బరువు ఉంటే.. ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడగలిగేది. అయితే ఆమె బరువు 50 గ్రాములు పెరగడంతో ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల గల్లంతైంది. రెజ్లింగ్‌లో, రెజ్లర్‌లను మ్యాచ్‌ల ముందు తూకం వేస్తారు. ఇది కాకుండా, రెజ్లర్ అదే విభాగంలో 2 రోజులు తన బరువును కొనసాగించాల్సి వచ్చినప్పటికీ, వినేష్ చేయలేకపోయింది.

6 / 6
ఫోగట్ ఇప్పుడు తప్పించారు కాబట్టి, ఆమెకు రజత పతకం కూడా లభించదు. తద్వారా 50 కిలోల విభాగంలో బంగారు, కాంస్య పతకాలను అందజేస్తారు. అంటే అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే స్వర్ణ పతకాన్ని అందుకుంది. అయితే, కాంస్య పతకం కోసం మ్యాచ్ జరగనుంది.