
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం కలిసి వస్తుంది. వారు బంగారం ధరించడం వలన సంపద వృద్ధి చెందడం, ఆర్థికంగా బలపడటం జరుగుతుంది. కానీ కొంత మందికి మాత్రం బంగారం హాని చేసే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా బంగారు నగలు ధరించడం వలన కొందరు చాలా కష్టాలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశి వారికి బంగారు లోహం కలిసి రాదు. అందువలన వీరు బంగారం ధరించకపోవడమే మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఈ రాశి వారిని శని దేవుడు పాలిస్తాడు, ఈయనకు బంగారు లోహం నచ్చదంట అంతే కాకుండా బంగారం సూర్య, గురు గ్రహాలతో ముడి పడి ఉంటుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కుంభ రాశి వారు బంగారం ధరించకూడదు.

వృశ్చిక రాశి : అలాగే వృశ్చిక రాశి వారికి కూడా బంగారం కలిసి రాదంట, వీరు ధరించడమే కాదు కొనుగోలు చేసినా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి వారు బంగారం ధరించడం లేదా కొనుగోలు చేయడం చేయకూడదంట.

వృషభ రాశి : వృషభరాశి వారు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం, ధరించడం మంచిది కాదు, వీరు బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా వీరు బంగారానికి సంబంధించిన వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో ఎక్కువగా నష్టాలే చవిచూస్తారు, ధరించడం వలన కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారంట.

మిథున రాశి : మిథున రాశి వారికి కూడా అస్సలే బంగారం కలిసి రాదు, ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేయడం, ధరించడం చేయకూడదు. నోట్ : పై సమాచారం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.