
మేష రాశి : మేష రాశి వారు దైర్యానికి ప్రతీక. వీరికి అబద్ధం చెప్పడం అస్సలు రాదు. ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారు. అందుకే వీరిని కొందరు కోపిష్టి అనుకున్నా, వీరి నిజాయితీ వల్లే అందరూ నమ్ముతారు. ఆఫీసులో అయినా, స్నేహంలో అయినా వీరు చెప్పేది నిజమే అని అందరికీ తెలుసు. అందుకే వీరిని చాలా మంది ఇష్టపడతారు

కన్యా రాశి :కన్యా రాశి వారు చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. అబద్ధం చెబితే దాని వల్ల జరిగే నష్టం ఏంటో వీరికి బాగా తెలుసు. అందుకే చిన్న అబద్ధం కూడా చెప్పడానికి ఇష్టపడరు. పర్ఫెక్షన్ కోరుకునే వీరు, మాట విషయంలో కూడా పర్ఫెక్ట్ గా నిజమే చెబుతారు. వీరిని నమ్మి ఏ రహస్యం చెప్పినా అది సేఫ్ గా ఉంటుంది.

తుల రాశి :తులా రాశి అధిపతి శుక్రుడు, వీరు న్యాయానికి, ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటివారిని మోసం చేయడం వీరి తత్వంలోనే లేదు. సమతుల్యత పాటించే వీరు, అబద్ధం చెబితే బ్యాలెన్స్ తప్పుతుందని భావిస్తారు. అందుకే కష్టమైనా సరే నిజం చెప్పి, తాత్కాలికంగా ఇబ్బంది పడినా నిజాయితీగా ఉంటారు.

మీన రాశి :మీన రాశి వారు మనసు చాలా సున్నితం. అమాయకంగా ఉండే వీరు అబద్ధం చెబితే ఎవరైనా బాధపడతారేమో అని భయపడతారు. వీరి హృదయం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే వీరు చెప్పే మాటల్లో మోసం ఉండదు. వీరిని మోసం చేయడం తేలికే కానీ, వీరు మాత్రం ఎవరినీ మోసం చేయలేరు.

ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. నిపుణుల సలహా, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.