
బొట్టు పెట్టుకోవడం కామన్. ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకుంటారు. ముఖ్యంగా శుభకార్యానికి వెళ్లినప్పుడు, దేవాలయానికి వెళ్లిన సమయంలో బొట్టు పెట్టుకోవడం అనేది శుభప్రదం. అందుకే చాలా మంది తిలకం బొట్టు పెట్టుకుంటారు. అయితే తిలకం పెట్టుకోవడం సహజం అయినప్పటికీ ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? దేనితో పెట్టుకోవడం అదృష్టాన్ని తీసుకొస్తుందో, చాలా మందిలో డౌట్ ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

చూపుడు వేలు: చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవడం గురు గ్రహానికి సంబంధించినది. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవడం అనేది సంపద ,విజయాన్ని సూచిస్తుంది. ఎవరు అయితే ఎక్కువగా చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటారో వారికి వృత్తి పరమైన విజయాన్ని అందుకుంటారని చెబుతున్నారు నిపుణులు. ఇది శుభప్రదమైన సంకేతాలను ఇస్తుందంట.

మధ్య వేలు : కొంత మంది చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే, మరికొంత మంది మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటారు. అయితే ఈ మధ్య వేలుతో బొట్టు పెట్టుకోవడం శని గ్రహానికి సంబంధించినది. మధ్య వేలితో బొట్టు పెట్టుకోవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతంది. అంతే కాకుండా ప్రశాంతత నెలకుంటుంది.

ఉంగరపు వేలు : చాలా వరకు పెద్దవారు ఎక్కువగా ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటారు. అయితే ఈ ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం అనేది ఆత్మవిశ్వాసానికి సంబంధించినది. ఇది ధనాకర్షణను పెంచుతుంది. అంతే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కలిసి వస్తుంది.

చిటికెన వేలు : చిటికెన వేలు బుధ గ్రహం, జలతత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. చాలా తక్కువ మంది ఈ వేలుతో తిలకం పెట్టుకుంటారు. కానీ ఈ వేలుతో బొట్టు పెట్టుకోవడం వలన ఆత్మ విశ్వాసం పెరుగుతుందంట.