
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వినాయక చవితి తర్వాత వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆనందకరంగా ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇంటా యబట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ లభిస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వీరి లైఫ్ చాలా ఆనందంగా కొనసాగుతుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వినాయక చవితి తర్వాత వీరి జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకోనుంది. ఈ రాశి వారు విదేశీ ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి త్వరలో పెళ్లి నిశ్చయం అవుతుంది. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి మంచి రోజులు మొదలు అయినట్లే వీరి జాతకం అనుకోని విధంగా గొప్ప మలుపు తిరుగుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలన్ని పొందుతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు